ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరు: మంత్రి హరీశ్ రావు

by Disha Web Desk 12 |
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరు: మంత్రి హరీశ్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరు. అలాంటి తల్లిని సంరక్షించుకునేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు తెలంగాణ సర్కార్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదంని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందుకోసం "బిడ్డ కడుపులో పడగానే - కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డ పుట్టగానే - కేసీఆర్ కిట్, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు - ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య సమస్యలు ముందుగానే గుర్తించి సత్వర చికిత్స అందించేందుకు - అరోగ్య మహిళ, వ్యాధి నిరోధకత పెంచేలా - 100% శాతం ఇమ్యునైజేషన్, ఇంటి నుండి ఆసుపత్రికి, ఆసుపత్రి నుంచి ఇంటికి ఉచిత ప్రయాణ సేవలు - అమ్మఒడి వాహనాలు, రాష్ట్ర వ్యాప్తంగా 28 మాతా శిశు సంరక్షణ కేంద్రాలు.. ఇవన్నీ తల్లులు, ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన రక్షణ వలయం అని మంత్రి చెప్పుకొచ్చారు.

అందుకే మాతృ మరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచిందని.. 2014లో ప్రసూతి మరణాలు 92 ఉంటే.. ప్రస్తుతం 43కు తగ్గింది. ఇది తల్లులు, ఆడ బిడ్డల సంరక్షణ పట్ల కేసీఆర్‌కి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి నిదర్శనం. దేవుడు అన్ని వేళలా, అన్ని చోట్ల అందుబాటులో ఉండలేడు కాబట్టి, ఆ దేవుడే అమ్మను సృష్టించాడు. ప్రతి ఒక్కరికీ అమ్మను అందించాడు అంటారు. అది వాస్తవం కూడా. అలాంటి అమ్మల ఆరోగ్యాన్ని కాపాడడం అందరి బాధ్యత. అనవసర కడుపు కోతలు తగ్గాలి, తల్లుల గోస తీరాలి అనే నినాదంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మాతృ ముర్తులందరికి ప్రపంచ తల్లుల దినోత్సవం శుభాకాంక్షలు" అంటూ మంత్రి హరీష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed