ALERT:వాతావరణశాఖ హెచ్చరిక..ఆ ఏడు జిల్లాల ప్రజలు బయటకు రావద్దు?

by Disha Web Desk 18 |
ALERT:వాతావరణశాఖ హెచ్చరిక..ఆ ఏడు జిల్లాల ప్రజలు బయటకు రావద్దు?
X

దిశ,వెబ్ డెస్క్:రోజురోజుకు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి.గతంలో కంటే ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి.మార్చి నెల చివరి నాటికే ఈ స్థాయిలో ఎండలు నమోదు అవ్వడం చూసి ఇక ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయింది. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈరోజు కనిష్టంగా 39 డిగ్రీలు ఆపైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉక్కపోత, వేడి గాలులతో కూడిన వాతావరణం ఉంటుంది.దీంతో ప్రజలు ఈ వేళలో బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం 11 జిల్లాల్లో 42.1 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా రాబోయే మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత పెరుగుతుందనీ తెలిపారు.

ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉగ్రరూపం దాల్చిన భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.ఆ ఏడు జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబ్ నగర్, కొమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వడగాలుల బారిన పడకుండా వారిని వారు రక్షించుకోవాలి. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Next Story