దళితబంధు విస్తరణపై సర్కార్ కీలక నిర్ణయం.. ఫస్ట్ ఫేజ్‌లో ఎంత మందికో తెలుసా?

by Disha Web Desk 2 |
దళితబంధు విస్తరణపై సర్కార్ కీలక నిర్ణయం.. ఫస్ట్ ఫేజ్‌లో ఎంత మందికో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళితబంధు పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం మొదటి దశలో నియోజకవర్గానికి 500 మంది చొప్పున మొత్తం 59,000 కుటుంబాలకు లబ్ది చేకూరేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాది మొత్తం 1.77 లక్షల మందికి దళిత బంధు స్కీమ్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు కింద ఇప్పటివరకు 36,392 మంది లబ్ధిదారులు ఖాతాలలో నిధులు చేసింది. దీంతో ఇప్పటి వరకు 31,088 యూనిట్స్ గ్రౌండ్ అయ్యాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో 18,402, వాసాలమర్రిలో 75, నాలుగు పైలట్ మండలాల్లో 4,808 దళితబంధు యూనిట్లు పూర్తయ్యాయి. దశలు వారిగా రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు 100% ప్రభుత్వ ఆర్థికసాయంతో ఎలాంటి బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా స్కీములు ఇవ్వనున్నారు. ప్రభుత్వ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసులకు RSP సవాల్.. MLA గాదరి కిషోర్‌పై సీరియస్



Next Story

Most Viewed