Viral News: కాపాడిన రైతుకు కావలి కాస్తున్న నాగుపాము.. ఎక్కడంటే..?

by Disha Web Desk 3 |
Viral News: కాపాడిన రైతుకు కావలి కాస్తున్న నాగుపాము.. ఎక్కడంటే..?
X

దిశ డైనమిక్ బ్యూరో: పాము కనిపిస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. లేదా కొట్టి చంపేస్తాం. అయితే పాముని చూసి మనిషి ఎలాగైతే భయపడతాడో పాము కూడా మనిషిని చూసి అలానే భయపడుతుంది. తనను తాను రక్షించుకోవడానికి కాటేస్తుంది. కానీ అదే పాముని కాపాడితే అది కూడా కృతజ్ఞత భావంతో ఉంటుంది అనడానికి మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ వింత ఘటన అర్ధం పడుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం లోని భుజరంపేట కూకట్లపల్లి శివారులో కర్నె హరీష్ రెడ్డి అనే వ్యక్తికి మామిడి తోట ఉంది. అయితే ఆ తోటకు కంచెలా వేసిన వలలో నాగుపాము చిక్కుకుని ఉండడం గమనించిన హరీష్ రెడ్డి ఆ పామును కాపాడి దానికి ఎలాంటి హానీ తలపెట్టకుండా వదిలిపెట్టాడు.

ఇక ఆ పాము కూడా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లిపోయింది. అయితే రైతు ఆ పాముని కాపాడినప్పటినుండి ప్రతి రోజు ఆ పాము పొలం దగ్గరకి వస్తుంది. అక్కడే ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కి పడగవిప్పి పని చేసుకుంటున్న రైతును చూస్తూ ఉంటుంది. సాయంత్రం ఆ రైతు వెళ్ళిపోయిన తరువాత ఆ పాముకూడా వెళ్ళిపోతుంది.

ఏడాది నుండి ప్రతి రోజు ఇదే తంతు కొనసాగుతోంది. అలానే ఆ పాము ఎవరికీ హాని తలపెట్టడం లేదు. దీనితో ఆ ఊరి ప్రజలంతా ఆ పామును దేవతగా భావిస్తున్నారు. ప్రతి రోజు ఆ పాముకి దండం పెట్టుకుని పనులకు వెళ్తున్నారు.

Next Story

Most Viewed