ఆగకుండా దగ్గు వస్తుందా.. అయితే వీటికి దూరంగా ఉండండి!

by Disha Web Desk 8 |
ఆగకుండా దగ్గు వస్తుందా.. అయితే వీటికి దూరంగా ఉండండి!
X

దిశ, ఫీచర్స్ : దగ్గు రావడం అనేది కామన్. చాలా మందిలో వచ్చే అనారోగ్య సమస్యల్లో దగ్గు ఒకటి. తమ శరీరానికి పడని ఫుడ్ తిన్నప్పుడ లేదా ఇన్‌ఫెక్షన్స్ వలన దగ్గు అనేది వస్తుంది. అయితే కొంత మందిలో ఈ సమస్య చాలా అధికంగా ఉంటుంది. పదే పదే దగ్గుతుంటారు. ఎన్ని మెడిసన్స్ తీసుకున్నా ఈ సమస్య నుంచి బయటపడలేకపోతారు. దీంతో ఏదో పెద్ద సమస్య వస్తుందేమో అని ఆందోళనకు గురి అవతుంటారు. కానీ అలా ఏ టెన్షన్ లేకుండా ఈ టిప్స్ పాటించి, ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం వలన ఈజీగా దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునంట. కాగా, అతిగా దగ్గు వస్తున్నప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.

దగ్గు సమస్యతో బాధపడుతున్నప్పుడు పెరుగు, పాల ఉత్పత్తులకు చాలా దూరంగా ఉండాలంట. అంతే కాకుండా నూనెలో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ కూడా అస్సలే తినకూడదు దీనివలన రోగ నిరోధక శక్తి తగ్గి, చాలా వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కొందరు జ్యూస్‌సె ఎక్కువగా తాగుతారు. అయితే అందులో పంచదార కలుపుతారు. అందువలన షుగర్ వేసిన పండ్ల రసాలు అస్సలే తాగకూడదు. కూల్ వాటర్, నెయ్యి, బెల్లంతో చేసిన స్వీట్స్ వంటి వాటికి దూరంగా ఉండటం వలన దగ్గు సమస్య నుంచి బయపటడవచ్చును. ముఖ్యంగా ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. దీని వలన కఫం పెరిగిపోయి దగ్గు సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇలా టిప్స్ పాటించినా దగ్గు అనేది తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి అంటున్నారు నిపుణులు.

Next Story

Most Viewed