తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లు ఇవే.. అవి కూడా మోడీ ఫేస్‌‌తోనే..!

by Disha Web Desk 2 |
తెలంగాణలో బీజేపీ గెలిచే సీట్లు ఇవే.. అవి కూడా మోడీ ఫేస్‌‌తోనే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపు పంజా వేయాలని చూస్తున్న కాషాయ పార్టీకి సర్వేల భయం పట్టుకుంది. కేవలం రెండు, మూడు సీట్లకే పరిమితమంటూ సర్వేల్లో చెబుతుండటంతో నేతలంతా టెన్షన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా పలు సర్వే సంస్థలు ఈ వివరాలను వెల్లడించాయి. తాము గెలుస్తామా? లేదా? అనే ఆందోళన వారిని వెంటాడుతోంది.

కమలదళంలో ఆందోళన

ఒకవైపు తెలంగాణలో కనీసం 10 సీట్లు సాధించి తమ సత్తా ఏంటో చూపాలని కాషాయ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఆదేశించింది. డబుల్ డిజిట్ టార్గెట్‌గా ఫిక్స్ చేసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు గాను గత ఎన్నికల్లో నాలుగు స్థానాలను పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి కనీసం 10 సీట్లలో గెలుపొందాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ ఆ లక్ష్యాన్ని అందుకోవడం కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి. కనీసం సిట్టింగు స్థానాలు నిలుపుకోవడమూ కష్టసాధ్యంగానే మారింది. ప్రస్తుత పరిస్థితులు కమలదళంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

లక్ష్యం చేరువయ్యేనా?

ఇటీవల ఓ జాతీయ స్థాయి మీడియా సంస్థ రిలీజ్ చేసిన సర్వేలో బీజేపీకి మూడు సీట్లు వస్తాయని అంచనా వేసింది. మరో మీడియా సంస్థ ఐదు స్థానాలు సాధిస్తుందని చెబుతోంది. అయితే ఈ గెలిచే స్థానాలు అయోధ్య రామమందిరం, మోడీ చరిష్మా వల్లేనని స్పష్టం చేసాయి. పోటీ చేసే అభ్యర్థులపై ప్రజల్లో పెద్దగా నమ్మకం లేదని చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు తాము పెద్ద లీడర్లమంటూ చెప్పుకున్నవారంతా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. గెలిచిన వారిలో చాలామంది కొత్తవారే. తమ సొంత బలం, పార్టీ సింబల్‌తో గెలిచారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నచోట బలమైన లీడర్లను రంగంలోకి దించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. స్ట్రాంగ్ లీడర్ షిప్‌ను వెతుకుతోంది. కానీ బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదని టాక్. అయితే ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్ర నాయకత్వం అందుకుంటుందా? లేక సర్వేల అంచనాలు నిజమవుతాయా? అనేది చూడాలి.



Next Story

Most Viewed