నంద్యాలలో యువగళం.. జగన్‌పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
Nara Lokesh
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో విచ్చలవిడిగా గంజాయి దొరకుతోంది. అంతేకాదు దేశంలో ఎక్కడ దొరికినా ఆ ఆనవాళ్లు రాష్ట్రంలోనే ఉంటున్నాయి. దీంతో ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా టీడీపీ ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు కురిపించారు. నంద్యాలలో యువగళం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ గంజాయి వల్ల ఒక తరం నాశనమవుతోందని చెప్పారు. గంజాయిపై వచ్చిన డబ్బంతా తాడేపల్లికి వెళ్తోందని ఆరోపణలు చేశారు. జగన్ అప్పుల అప్పారావులా తయారయ్యారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, రోడ్లు, కార్యాలయాలు తాకట్టు పెట్టి అప్పులు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జనం ఆస్తులపై పడ్డారని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరమైందని లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చంద్రబాబు రెండో సంతక చేస్తారని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారని మండిపడ్డారు. జగన్ వల్ల యువత భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read More..

AP News:గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు

Next Story