ముందుకొచ్చింది ఒక్క సంస్థే.. మరోసారి 'ఇంటర్' టెండర్లకు ఆహ్వానం

by Disha Web Desk 2 |
ముందుకొచ్చింది ఒక్క సంస్థే.. మరోసారి ఇంటర్ టెండర్లకు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనానానికి బోర్డు అధికారులు గత నెల 24వ తేదీన టెండర్లను ఆహ్వానించారు. సోమవారంతో ఈ ప్రక్రియకు గడువు ముగిసింది. చివరిరోజు నాటికి మాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకే ఒక్క సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి టెండర్‌ను ఆహ్వానిస్తామని, త్వరలోనే తేదీ ప్రకటిస్తామని ఎగ్జామినేషన్ కంట్రోలర్ విభాగం అధికారులు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి చేసిన ఆరోపణలను బోర్డు ఖండించింది.

గ్లోబరీనా సంస్థ సీఓఈఎంపీటీ అనే సంస్థ పేరిట పేరు మార్చుకుని టెండర్ దాఖలు చేశారన్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కొట్టిపడేశారు. త్వరలోనే టెండర్ల తేదీని ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా టెండర్లకు ఒకే సంస్థ రావడం, తొలి ప్రక్రియ ఫెయిల్ కావడంపై ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్‌కు సంబంధించి నిర్ణయాలను మార్పులు చేయాలన్నారు. అంతేకాకుండా ఈ ఆన్ లైన్ వాల్యుయేషన్‌ను దశలవారీగా అమలు చేయాలని కోరారు.


Next Story

Most Viewed