బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన తెలంగాణ బీజేపీ

by Disha Web Desk 2 |
బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన తెలంగాణ బీజేపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. గురువారం హైదరాబాద్‌లోని నాగోల్ వేదికగా జరిగిన బీసీ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని తెలిపారు. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తామని, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది.

Also Read..

తెలంగాణలో భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని KCR ప్లాన్: బండి సంజయ్ ఫైర్

Next Story

Most Viewed