తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

by Disha Web Desk 4 |
తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ జనవరిలో హ్యాక్ అవగా రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ముంబై నుంచి గవర్నర్ ఖాతా హ్యాక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఓ బొటిక్ వైఫైని దుండగుడు వినియోగించినట్లు తేల్చారు. బొటిక్ నిర్వాహకురాలిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. అయితే బొటిక్ షాప్ కొన్ని రోజులుగా మూసిఉన్నట్లు తెలిసింది.

నిర్వాహకురాలిని ప్రశ్నించిన పూర్తి సమాచారం తెలియకపోవడం గమనార్హం. అయితే తెలంగాణకు చెందిన కీలక వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లు వరుసగా హ్యాక్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. అయితే గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యక్ ఘటనలో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed