TS: స్టాఫ్​నర్సు ఫలితాలు విడుదల

by Disha Web Desk 2 |
TS: స్టాఫ్​నర్సు ఫలితాలు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్టాఫ్ నర్స్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌‌బీ) సోమవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీ వివరాలతో మార్కులు చూసుకునేలా బోర్డు వెబ్‌సైట్‌లో ఆప్షన్ ఇచ్చింది. మార్కులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5:30 గంటల లోపల తెలపాలని సూచించారు. ఇందుకోసం వెబ్‌సైట్‌లో ఆప్షన్ ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో 2022 డిసెంబర్‌‌లో 5204 స్టాఫ్ నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షను నిర్వహించగా, సుమారు 40 వేల మంది పరీక్ష రాశారు.

అయితే ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న మిగిలిన స్టాఫ్ నర్స్ పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్‌లో కలిపి భర్తీ చేయాలని స్టాఫ్​నర్స్ యూనియన్లు గత ప్రభుత్వాన్ని కోరాయి. కానీ స్పందించలేదు. దీంతో తాజాగా హెల్త్ మినిస్టర్‌గా దామోదర రాజనర్సింహా బాధ్యతలు చేపట్టాక, నర్సింగ్ అసోసియేషన్లు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సీఎంతో చర్చించి వెంటనే 1890 పోస్టులను కలిపి 7094 పోస్టులను ఇదే నోటిఫికేషన్‌లో భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహాకు రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుజాత రాథోడ్, నర్సింగ్ ఆఫీసర్లు లక్ష్మన్ రూడవత్, సోమేశ్ , విద్య సాగర్,రవి నాయక్ క్రిష్ణ, పాండు, హరిత, కవితలు థ్యాంక్స్ చెప్పారు. కొత్త ప్రభుత్వంలో స్టాఫ్​నర్సుల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయనే అభిప్రాయన్ని వ్యక్త పరిచారు.



Next Story

Most Viewed