దసరా రోజు దుర్గామాతనే ఎందుకు పూజించాలి..?

by Dishanational1 |
దసరా రోజు దుర్గామాతనే ఎందుకు పూజించాలి..?
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎన్నో పండుగలున్నా కూడా దసరా పండుగకు ఎందుకింత విశిష్టత..?, అదేవిధంగా దసరా పండుగకు దుర్గామాతనే ఎందుకు కొలుస్తారు...? ఇలాంటి ప్రశ్నలు చాలామందిలో మెదళ్లలో కదులుతుంటాయి. అయితే, దసరా పేరులోనే కాస్త అటు ఇటూ చేస్తే సరదా ఉంటుంది. ఉన్న పండుగలన్నింటిలో ఈ పండుగ విశిష్టమైనది. దేశవ్యాప్తంగా పదిరోజులపాటు దసరా పండుగను ఎంతో సంతోష సంభ్రమాలతో, ఆటపాటలతో జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రీతిగా పూజలు జరిపి చివరి రోజున(10వ రోజు) విజయదశిమిని వైభవంగా జరుపుకుంటారు.

శరన్నవరాత్రుల సమయంలో ఆదిపరాశక్తి మహిషాసురుని వధించింది కాబట్టే దానికి గుర్తుగా దుర్గామాతను పూజిస్తారు. అందుకే ఈ శరన్నవరాత్రులను దేవీ నవరాత్రులని అంటారు. దుర్గామాత తొమ్మిదిరోజులపాటు రాక్షసులను వెంటాడి, సంహరించింది. చివరికి పదో రోజున రాక్షసులపై విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా 10వ రోజున విజయదశిమి జరుపుకుంటారు. దుర్గమాతను పూజిస్తే అంతా మంచే జరుగుతదని, అదేవిధంగా ఏ పని ప్రారంభించినా అది సాధ్యమైతదని నమ్మకం. అందుకే మిగతా పండుగల్లో లాగా కాకుండా దసరా వేడుకల్లో ఒక్కోరోజు ఆ శక్తిని ఒక్కో రూపంలో ధ్యానించి, పూజించి, ఆమె కృపకు పాత్రులు అవుతుంటారు.


Next Story

Most Viewed