Raghu Rama Krishna Raju కి సిట్ మెయిల్. విచారణకు రావాల్సిన అవసరం లేదు

by Disha Web Desk |
Raghu Rama Krishna Raju  కి సిట్ మెయిల్. విచారణకు రావాల్సిన అవసరం లేదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏపీ నర్సాపూర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నేడు సిట్ విచారణకు హాజరుకావడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతానికి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని.. రఘురామకు సిట్ ఈ మెయిల్ పంపింది. మళ్లీ అవసరం అయితే పిలుస్తామంటూ సిట్ తెలిపింది. అయితే, గత 3 రోజుల క్రితం ఈ కేసు విచారణలో భాగంగా సిట్ సీఆర్పీసీ 41ఏ కింద ఎంపీ రఘురామకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 10.30 నిమిషాలకి కమాండ్ కంట్రోల్ సెంటర్ సిట్ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితులుగా వ్యవహరించిన రామచంద్రభారతి, సింహయాజీలతో కలిసి రఘురామ దిగిన ఫొటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితులతో ఎంపీ రఘురామకు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే 41ఏ నోటీసులు అందుకున్న నలుగురిని నిందితుల జాబితాలో చేర్చింది. విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని సిట్ తెలిపింది. ఇప్పటికే విచారణకు హాజరుకాని ఇద్దరికి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కానీ, ఇవాళ రఘురామ విచారణకు అవసరం లేదని సిట్ అధికారులు తెలిపారు.

Next Story