మీ మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం: సర్కార్‌పై షర్మిల సెటైర్స్

by Disha Web Desk 19 |
మీ మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం: సర్కార్‌పై షర్మిల సెటైర్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రతిపక్షాలు ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ప్రతిపక్షాలు చేసేది గోబెల్స్ ప్రచారమైతే.. తొమ్మిదేళ్లుగా అబద్దాల పాలన చేసే మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారానికి మీరు, మీ ముఖ్యమంత్రే అసలు సిసలు వారసులు అని అన్నారు. శనివారం ట్విట్టర్ వేదికగా షర్మిల స్పందిస్తూ.. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని 4.50 లక్షల అప్పుల కుప్పుగా మార్చారని.. ఇంత అప్పు చేసినా సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని, చివరకు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా దిక్కులేక ఆస్తులు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు.

దేశానికి తెలంగాణ దిక్సూచి అంటే రాష్ట్రాన్ని అమ్మేసి, అంధకారంలోకి నెట్టేయడమేనా అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెనకబాటు నుంచి వెలుగులోకి కాదు.. మీ ధనదాహంతో అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ అరాచకాలను ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు, గృహ నిర్భందాలు, సంకెళ్లు విధిస్తున్నారని ఇలా చెప్పుకుంటూ పోతే మీ మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం అంతా అవుతుందన్నారు. మీ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి దొంగల పాలనను అంతం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

Read more:

AvinashReddy Bail: సీబీఐ సంచలన వాదనలు..అంతేదీటుగా హైకోర్టు ప్రశ్నలు

Next Story

Most Viewed