CM రేవంత్ రెడ్డికి ఆ టెన్షన్.. DK అరుణ షాకింగ్ కామెంట్స్

by Rajesh |
DK Aruna
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన పట్ల ఏమాత్రం అవగాహన లేదు. ఐదు నెలలు అవుతున్న పాలనపై పట్టు సాధించకుండా.. హైప్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఏవి లేవు అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ మేరకు ఆమె శనివారం హైదరాబాదులో తన స్వగృహంలో పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవకాశం దక్కింది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్న ఉచిత బస్సు సౌకర్యం మినహాయిస్తే.. మిగిలిన ఒక్క పథకం కూడా అమలు కాలేదని డీకే అరుణ చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయనకు అధికారం పట్ల అవగాహన లేదు. పార్లమెంటు ఎన్నికలలో ఊహించినట్లుగా సీట్లు దక్కడం లేదు అన్న టెన్షన్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఆమె ఆరోపించారు. యువతనే కాకుండా ఎప్పుడు కాంగ్రెనస్‌కే ఓట్లు వేసే వృద్ధులు సైతం మోడీపై విశ్వాసంతో ఈ పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి అండగా నిలిచారని చెప్పారు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో 10 నుండి 12 పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉండడంతో సీఎం టెన్షన్‌లో ఉన్నాడన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజలతో ఏమాత్రం సంబంధాలు లేవన్నారు.

కొడంగల్‌లో మాత్రం ముఖ్య నాయకులతో తప్ప ప్రజలతో ఏమాత్రం సంబంధాలు లేవని చెప్పారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పి.. వాళ్లు పండించిన పంటను కొని పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులు తప్పని పరిస్థితిలో కర్ణాటక‌లో తమ వరి ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని చెప్పారు. కురుస్తున్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్న ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అన్నారు. జూరాలకు కర్ణాటక రాష్ట్రం నారాయణపూర్ డ్యాం నుండి నీటిని తీసుకురావడంలో విఫలం చెందారని ఫైర్ అయ్యారు. దీనివల్ల రైతుల పంట చేలు ఎండిపోవడంతో పాటు.. తాగడానికి అవసరమైన మంచినీరు కూడా లభించని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.

Next Story

Most Viewed