శ్రీచైతన్య యాజమాన్యం‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.. హెచ్ఆర్సీకి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఫిర్యాదు

by Dishafeatures2 |
శ్రీచైతన్య యాజమాన్యం‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.. హెచ్ఆర్సీకి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కార్పోరేట్ శ్రీచైతన్య కళాశాలలో మార్కులు, ర్యాంకులు దాహం కోసం వేధింపులు గురి చేసి, దాడి చేసిన శ్రీచైతన్య యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ నాయకులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజులు మాట్లాడుతూ.. స్టూడెంట్ సాత్విక్ సూసైడ్ ఘటనలో పోలీసులు యాజమాన్యంతో సెటిల్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

శ్రీచైతన్య యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మరోక విద్యార్ధి నష్టపోకుండా కమిషన్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు అందించిన వారిలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, కె.అశోక్ రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed