టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇల్లు చూశారా.. ఇంద్ర భవనంలా ఉందిగా!

by Dishafeatures1 |
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇల్లు చూశారా.. ఇంద్ర భవనంలా ఉందిగా!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది ‘సలార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఫామ్‌లో ప్రజెంట్ ‘సలార్-2’, స్పిరిట్, రాజాసాబ్, కల్కి, వంటి చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా మారిపోయాడు. అలాగే హను రాఘవపూడితో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు. దీంతో గత కొద్ది కాలంగా సోషల్ మీడియాకు దూరం అయ్యాడు. కల్కి షూటింగ్‌లో పాల్గొంటూ తన లుక్స్‌ను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఈ సినిమా జూన్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో అప్పుడప్పుడు ప్రభాస్ ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా, డార్లింగ్‌ను కొంతమంది ఫ్యాన్స్ స్వయంగా ఆయనను కలవడానికి ఇంటికి వెళ్లారు. ప్రభాస్‌తో ఫొటోలు తీసుకోవడంతో పాటుగా ఇల్లును, అందులో ఉన్న అవార్డ్స్‌ను చూపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే ఆ ఫోటోలలో ప్రభాస్ ఇల్లు కూడా ఉండగా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ప్రభాస్ సింపుల్ గా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ రెమ్యూనరేషన్ ఇతర హీరోల కంటే ఎక్కువగా ఉంది అని మనకు తెలుసు అయినా కూడా ఇంత సింపుల్ గా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వడం పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read More...

హిజ్రాగా మారిన ప్రభాస్.. నడిరోడ్డుపై సిగ్గుతో సచ్చిపోయిన స్టార్ హీరో..అసలు కారణం అదేనా.!




Next Story