సెటిలర్ల ఓటు బ్యాంకు టార్గెట్.. చంద్రబాబును మచ్చిక చేసుకునేందుకు BRS స్కెచ్!

by Disha Web Desk 4 |
సెటిలర్ల ఓటు బ్యాంకు టార్గెట్.. చంద్రబాబును మచ్చిక చేసుకునేందుకు BRS స్కెచ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: చంద్రబాబును పరామర్శించేందుకు ఏ స్థాయి లీడరును పంపాలనే అంశంపై బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. కేటీఆర్‌ను పంపాలా? లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలను పంపించాలా? అని మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ అధినేత హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్‌పై కేటీఆర్ స్పందించిన తీరుతో ఆంధ్ర సెటిలర్లలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని కూల్ చేసేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

సెటిలర్లను కూల్ చేసే ప్రయత్నం..

బాబు అరెస్ట్‌ను ఖండిస్తూ సైబరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వీరిపై పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో బాబు అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్ ఏపీ రాజకీయాలపై హైదరాబాద్‌లో ఆందోళనలు చేసేందుకు అనుమతి ఇవ్వబోమని, ఇదే విషయాన్ని తనకు ఫోన్ చేసిన టీడీపీ లీడర్ లోకేశ్‌కు చెప్పినట్టు వెల్లడించారు. దీంతో ఏపీ సెటిలర్లు బీఆర్ఎస్‌పై భగ్గుమన్నారు.

ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీని సపోర్టు చేసి తప్పు చేశామనే అభిప్రాయానికి వచ్చి, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని గ్రహించిన కేసీఆర్ నష్టనివారణ కోసం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌కు వచ్చిన బాబును పరామర్శించకపోతే సెటిలర్ ఓటర్లలో మరింత వ్యతిరేకత పెరుగుతుందనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే పరామర్శ బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించాలా? లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు మాగంటి గోపి, అరికపుడి గాంధీలను పంపిచాలా?అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed