టీఎస్‌పీఎస్సీ పేపర్ స్కాంలో సంచలన విషయాలు.. ఇన్విజిలేటర్‌కి ముడుపులు

by Disha Web Desk 21 |
టీఎస్‌పీఎస్సీ పేపర్ స్కాంలో సంచలన విషయాలు.. ఇన్విజిలేటర్‌కి ముడుపులు
X

దిశ,వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్​ లీకేజీ వ్యవహారంలో విద్యుత్ శాఖ డీఈ రమేష్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ హైటెక్ డివైజ్ ద్వారా సమాచారం చేరవేర్చినట్లు సిట్ తేల్చింది. ఇన్విజిలేటర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు సంచలన విషయాలు తెలుసుకున్నారు. రమేష్ ఇన్వెజిలేటర్‌కి రూ. 20 లక్షలు ఇచ్చినట్లు సిట్ అధికారులు తేల్చారు.

క్వశ్చన్ పేపర్​ లీకేజీ వ్యవహారంలో విద్యుత్ శాఖ డీఈ రమేశ్.. ఏఈ ప్రశ్నపత్రం విక్రయించడం ద్వారా రమేశ్‌ కోటి 10 లక్షలు సంపాదిచినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 30 మందికి అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్లు విక్రయించినట్లు సిట్‌ గుర్తించింది. గతంలో వరంగల్ విద్యుత్‌ శాఖలో DEగా పనిచేసిన రమేశ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు.


Next Story

Most Viewed