Medigadda Barrage: మేడిగడ్డ అకస్మాత్తుగా కుంగలే.. విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు..!

by Disha Web Desk 19 |
Medigadda Barrage: మేడిగడ్డ అకస్మాత్తుగా కుంగలే.. విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సంచలన రిపోర్ట్ రెడీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై కాంగ్రెస్ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ ఇరిగేషన్ శాఖ కార్యాలయంతో పాటు ఫీల్డ్‌లోకి దిగి డ్యామేజీ అయిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి రిపోర్ట్ రెడీ చేసినట్లు సమాచారం. కాగా, ఈ రిపోర్ట్‌లో విజిలెన్స్ సంచలన విషయాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పేరుతో రూ.3,200 కోట్ల ప్రజాధనం వృథా చేశారని రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 11 పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు.. మరమ్మతులు చేసినంత మాత్రన మొత్తం బ్యారేజీకు గ్యారెంటీ లేదని రిపోర్ట్ లో పేర్కొన్నట్లు సమాచారం. వరద ఉద్ధృతి అంచనా లేకుండానే మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ చేశారని.. ఈ బ్యారేజ్‌ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని గుర్తించినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ లోకేషన్, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అంతా గందరగోళమని.. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు దోషులేనని విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ మధ్యంతర రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ మధ్యంతర నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించేందుకు విజిలెన్స్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed