పోటా పోటీగా పాదయాత్రకు టీ-కాంగ్రెస్ సీనియర్లు ప్లాన్

by Disha Web Desk 2 |
పోటా పోటీగా పాదయాత్రకు టీ-కాంగ్రెస్ సీనియర్లు ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీ కాంగ్రెస్‌లో మరిన్ని పాదయాత్రలు షురువయ్యే చాన్స్​కనిపిస్తున్నది. టీ పీసీసీ అధ్యక్షుడు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీనియర్లు ఇప్పటికే రేవంత్​యాత్రకు దూరంగా ఉంటున్నది తెలిసిందే. దీనికి తోడు ఏఐసీసీ ప్రోగ్రామ్స్ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోరు యాత్ర పేరిట మరో పాదయాత్రను కూడా స్టార్ట్ చేశారు. ఇది విజయవంతంగా కొనసాగుతున్నది. దీనికి కంటిన్యూగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ సీనియర్లు ఆధ్వర్యంలో పాదయాత్రను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని సీనియర్లు, కీలక నేతలు కూడా పాదయాత్ర చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఇంటర్నల్​గా ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు మరి కొందరు సీనియర్లు పాదయాత్రలు ప్రారంభించే చాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నది.

జిల్లాల్లో ప్రభావం చూపేలా...

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ జిల్లాలో ఆయన మరికొంత మంది సీనియర్లను కలుపుకొని పాదయాత్ర చేస్తే పార్టీకి మేలు జరుగుతుందని రేవంత్​ను వ్యతిరేకిస్తున్న వర్గం వాదన. నల్లగొండలో మొదలు పెట్టి రంగారెడ్డిని టచ్​చేస్తూ హైదరాబాద్​వరకు పాదయాత్ర చేయాలనేది పార్టీలో సీనియర్ల ప్రపోజల్. ఉమ్మడి ఖమ్మంలో భట్టి నేతృత్వంలో పాదయాత్రను షురూ చేసి, ఆ జిల్లాలోని సీనియర్లందరినీ భాగస్వామ్యం చేయాలని సీనియర్​కాంగ్రెస్​నేతలు భావిస్తున్నారు. మహబూబ్​నగర్​లోనూ సీనియర్లందరినీ ఏకతాటిపై కి తీసుకువచ్చి పాదయాత్ర చేయాలని ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. అన్ని జిల్లాల్లో సీనియర్ల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరగాలని కేడర్​ఒత్తిడి తెస్తున్నట్లు గాంధీభవన్​లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కొందరు సీనియర్లు పాదయాత్రపై క్షేత్రస్థాయి లీడర్ల నుంచి ఫీడ్​బ్యాక్​కూడా తెప్పించుకుంటున్నారు. మరి కొందరు నియోజకవర్గాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. అయితే సీనియర్లు చేయాలనుకుంటున్న మరో పాదయాత్ర, రేవంత్​ఇటీవల చేసిన హాథ్​సే హాథ్​యాత్ర రూట్లలో నిర్వహించాలనుకోవడం గమనార్హం.

రేవంత్‌కు తలనొప్పి..

సీనియర్లంతా తలోదారి పడుతుండటంతో టీ పీసీసీ అధ్యక్షుడికి పార్టీలో ఏం జరుగుతున్నదనేది? అర్థం కావడం లేదు. రేవంత్​దురుసుతనంతోనే దూరం అవుతున్నామని సీనియర్లు ఆఫ్​ది రికార్డులో ఇప్పటికే వెల్లడించారు. వాళ్లను తన వైపు తిప్పుకునేందుకు రేవంత్​ వివిధ ప్రయత్నాలు చేసినా, ఫలితాలు రావడం లేదు. స్వయంగా ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ చార్జి థాక్రే ఎంట్రీ ఇచ్చినా.. పరిస్థితులు చక్కబడలేదు. పైగా ఇప్పుడు ఎన్నికల సీజన్​సమీపిస్తున్న తరుణంలో సీనియర్లు తీసుకుంటున్న నిర్ణయాలు రేవంత్​ కు తలనొప్పిగా మారాయి. దీంతో ఏం చేయాలో? అర్థం కాగా రేవంత్​వర్గం కూడా తలలు పట్టుకుంటున్నదని గాంధీభవన్​లోని ఓ నేత చెప్పారు.

Next Story

Most Viewed