సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేసేవారికి సజ్జనార్ కీలక సూచన

by Disha Web Desk 19 |
సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేసేవారికి సజ్జనార్ కీలక సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్‌ మీడియాలో ఫొటోలు, ఆడియో, వీడియోలు విరివిగా పోస్టు చేస్తున్నారా..? అయితే జరభద్రం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైబర్‌ నేరగాళ్లు అడ్డదారులు తొక్కడానికి వినియోగిస్తూ.. మోసాలు, వంచనకు పాల్పడుతున్నారని ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు.

అసలుకు నకిలీకి తేడా లేనంతగా ఫొటోలే కాదు.. వీడియోలను, చివరకు స్వరాన్ని కూడా మార్చేస్తున్నారని సూచించారు. డీప్‌ ఫేక్‌‌గా చెప్పుకుంటున్న ఈ మోసాలు పెరుగుతున్నాయని, చాలా మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని వెల్లడించారు. డీప్‌ ఫేక్‌ మోసాల విషయంలో ఏమాత్రం ఆదమరిచిన ముప్పు తప్పదన్నారు. సోషల్‌ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాలని, ఫొటోలు, ఆడియో, వీడియోలు పోస్టు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని సూచించారు.


Next Story