మోసపూరిత సంస్థల పని పట్టాలి: సజ్జనార్

by Disha Web Desk 2 |
మోసపూరిత సంస్థల పని పట్టాలి: సజ్జనార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మోసపూరిత సంస్థల మాయలకు నిత్యం వేలాది మంది నష్టపోతున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సుమోటోగా కేసులు నమోదు చేసి, ఆయా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మరింత ఫోకస్ పెట్టాలన్నారు. "ఎంత చెబుతోన్న డెరెక్ట్ సెల్లింగ్ ముసుగులో గొలుసుక‌ట్టు మోసాలు జ‌రుగుతూనే ఉన్నాయి. చాప‌కింద నీరులా #QNet త‌ర‌హా దందాలు కొన‌సాగుతున్నాయి.

తాజాగా ఓ యువ చార్టర్డ్ అకౌంటెంట్ దుర్మార్గపు సంస్థ #QNet వ‌ల‌లో చిక్కుక్కున్నారు. అధిక డ‌బ్బుకు ఆశ‌ప‌డి రూ.8 ల‌క్షల‌ను స‌మ‌ర్పించుకున్నట్లు ట్విట్టర్ ద్వారా నా దృష్టి తీసుకొచ్చాడు. న్యాయం చేయాలంటూ ఇటీవ‌ల న‌న్ను క‌లిశాడు. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ మాదిరిగా ఎంతో మంది మోసపోయామంటూ నాకు ట్విట్టర్‌లో సందేశాలు పంపిస్తున్నారు. మోస‌పూరిత ఎంఎల్ఎం సంస్థల‌పై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ దృష్టి సారించాలి. ఈ ఘ‌ట‌న‌ల‌పై సుమోటోగా కేసు న‌మోదు చేసి బాధ్యుల‌ను చ‌ట్టప్రకారం శిక్షించాలి" అని సజ్జనార్ ట్విట్టర్ వేదిక సూచించారు.



Next Story

Most Viewed