Breaking: ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి చేసిన ప్యాసింజర్లు..కారణం ఇదే

by Disha Web Desk 3 |
Breaking: ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి చేసిన ప్యాసింజర్లు..కారణం ఇదే
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలంగాణాలో ఓ వైపు సమ్మక్క సారలమ్మ జాతర కన్నుల విందుగా జరుగుతుంటే.. మరో వైపు అటు ప్రభుత్వ వ్యవహార శైలి పై ఇటు ప్రజల తీరుపై అసహనానికి గురైన ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేపట్టారూ. తమ జీతాలు పెంచాలని ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రజల తీరుని నిరసిస్తూ తెలంగాణాలో ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను నిలిపివేసి నిరసనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణా లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్‌లో ఈ రోజు ఉదయం ఓ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ కోసం హారన్ కొట్టాడు. దీనితో అతని పై ఓ ప్యాసింజర్ దాడి చేశారు. ఈ ఘటన గురించి మాట్లాడిన తోడి డ్రైవర్ సమాచారం ప్రకారం.. నరసయ్య అనే ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ గా గత పది సంవత్సరాలుగా పని చేస్తున్నారని తెలిపారు. ఇక ఎప్పటిలానే ఈ రోజు ఉదయం 7 గంటలకు బస్సును బయట నిలబెట్టి.. కండక్టర్ కోసం రెండు సార్లు హారన్ కొట్టారని తెలిపారు.

అప్పుడు ఓ ప్యాసింజర్ వచ్చి ఏంట్రా హారన్ కొడుతున్నావ్ తెలివిలేదా అని కోపాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. ఇక ప్యాసింజర్ మాటలు పై స్పందించిన డ్రైవర్ కాస్త మంచిగా మాట్లాడండి.. ఎందుకలా మాట్లాడుతున్నారని ప్రశ్నించగా.. నీకేంటి మర్యాద ఇచ్చేది అంటూ ఆ ప్యాసింజర్ దుర్భాషలాడుతూ డ్రైవర్ సైడ్ డోర్ ను తీసేసి.. సీట్లో ఉన్న డ్రైవర్ ను కిందకు లాగి ఇద్దరు ముగ్గురు కలిసి బౌతికంగా డ్రైవర్ పై ఇదే బస్టాండ్ లో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్టాండ్ లోనే ఈ పరిస్థితి ఉంటె తాము హైవే రోడ్లపైన వెళ్తాం.. పల్లెటూర్లలో వెళ్తాం అక్కడ తమ దుస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అని పేర్కొన్నారు. చిన్న పిల్లల నుండి పండు ముసలివాళ్ళ వరకు వాళ్ళు కోరుకున్న గమ్యస్థానానికి సురక్షితంగా చేసారుస్తున్న తమపై ఇలా భౌతిక దాడులు జరుగుతుంటే ఎంతవరకు తాము సహించాలి అని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక కొంతమంది మహిళైతే అత్యంత దారుణమైన అత్యంత నీచమైన పదాలను వాడుతూ డ్రైవర్లను తిడుతున్నారని ఆరోపించారు.

ఎవరు ఎన్ని తిట్టిన సహిస్తూ భరిస్తూ అతి తక్కువ జీతానికి ఈ ఉద్యోగాలు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలోనూ ఇలా డ్రైవర్ల పై దాడులు జరగడం, కేసులు అయ్యి నిందితులను జైల్లో వేయడం చూస్తూ కూడా ప్యాసింజర్లు తమ పై భౌతికంగా దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇక కాగ్రెస్ ప్రుభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని తెచ్చిందని దాన్ని తాము స్వాగతిస్తున్నాని తెలిపారు.

ఇక యాబైఆరు సీట్ కెపాసిటీ ఉంటె నూట యాభైఆరు, నూట నలభైఐదు మంది బస్సు ఎక్కిన వాళ్ళను సహిస్తూ.. భరిస్తూ వేగంగా వెళ్లకుండా మెల్లగా వెల్తూ వాళ్ళను వాళ్ళ గమ్యస్థానాలకు క్షేమంగా తీసుకెళ్తున్నామని.. అయిన వాలు ఆపమన్న చోట ఆపలేదంటూ.. ఎక్కువమంది ఉన్నారు పడతారు దిగమంటే మేము దిగాం ఎం చేసుకుంటారో చేసుకోండి అనడం.. టిక్కెట్లు సరిగా తీసుకోక పోవడం.. ఆధార్, టిక్కెట్లు అలాంటివి చూపించమంటే బస్సును పక్కకు ఆపించి కండక్టర్ పైన, డ్రైవర్ పైన దాడి చేయడం చాల దారుణమని దాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. ఇక ఈ రోజు డ్రైవర్ నరసయ్య పైన జరిగిన దాడిని ఖండిస్తూ ధర్నా చేస్తున్నట్లు అలానే ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.


Next Story