‘BL సంతోష్ కనిపించడం లేదని పోస్టర్లు వేయడం హాస్యాస్పదం’

by Disha Web Desk 2 |
‘BL సంతోష్ కనిపించడం లేదని పోస్టర్లు వేయడం హాస్యాస్పదం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ BL సంతోష్ కనిపించడం లేదని వాల్ పోస్టర్లు వేయడం హాస్యాస్పదంగా ఉందని ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ(ప్రధాన కార్యదర్శి) కాచం రమేశ్ అన్నారు. బర్కత్ పురలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లడారు. బీఎల్ సంతోష్ దేశ రాజధాని ఢిల్లీలో ఉంటారని, ఆయనకో ఇల్లు, అడ్రస్ కూడా ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నవారు జీవితాన్ని త్యాగం చేస్తారని, సింప్లీసిటీ జీవితాన్ని గడుపుతారని ఆయన తెలిపారు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలా పోస్టర్లు వేశారని ఆయన విమర్శలు చేశారు. ప్రచారక్ లు ఎలాంటి ఆశలు ఆశించకుండా పూర్తి జీవితాన్ని సంస్థకు ధారపోస్తారన్నారు. బీఎల్ సంతోష్ బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అని, అలాంటి వ్యక్తిపై పోస్టర్లు వేయడం సరికాదని ఆయన ధ్వజమెత్తారు. చట్టం నిర్ణయించిన ప్రకారం ఆర్ఎస్ఎస్ నడుచుకుంటుందని ఆయన చెప్పారు. సంతోష్ జీ ప్రస్తుతం బీజేపీకి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారని, కాబట్టి ఆ అంశాన్ని బీజేపీ చూసుకుంటుందని రమేశ్ తెలిపారు.

ఇదిలా ఉండగా హర్యానాలో ఈనెల 12 నుంచి 14 వరకు నిర్వహించిన కార్యవాహ సమర్పించిన వార్షిక నివేదికపై ఆయన వెల్లడించారు. గతేడాది ఒక్క సంవత్సరంలోనే 1,21,137 మంది యువకులు సంఘ ప్రాథమికి శిక్షణును పొందినట్లు వెల్లడించారు. దేశమంతటా ఇప్పటి వరకు మొత్తం 42,613 స్థానాల్లో 68,651 శాఖలు కొనసాగుతున్నాయని తెలిపారు. గతేడాది ఈ సంఖ్య 37,903 స్థానాల్లో 60,117 శాఖలుగా ఉందన్నారు. తెలంగాణ లో ఆర్ఎస్ఎస్ పనితీరుపైనా రమేశ్ స్పష్టతనిచ్చారు. తెలంగాణలో మొత్తం 1616 ఉప మండలాలున్నట్లుగా తెలిపారు. 1138 శాఖలు, 280 మిలన్, మండలిని కలిపితే మొత్తం 1418 ఉన్నాయన్నారు. ఇది 88 శాతానికి పెరిగిందన్నారు. కాగా గతేడాదితో పోల్చితే 8 శాతం అధికమన్నారు. ఇదిలా ఉండగా బస్తీలు 1447 ఉండగా 962 శాఖలు, 113 మిలన్, మండలిలను కలిపి మొత్తం 1075 ఉన్నట్లుగా తెలిపారు. ఇది మొత్తం 74 శాతం ఉండగా గతేడాదితో పోలిస్తే 9 శాతం పెరిగిందన్నారు.

Next Story

Most Viewed