త్యాగాలు మావి భోగాలు కేసీఆర్​వి..బీసీల‌పై రేవంత్​రెడ్డి చిత్తశుద్ధి బయటపడింది: ఆలె భాస్కర్

by Disha Web |
త్యాగాలు మావి భోగాలు కేసీఆర్​వి..బీసీల‌పై రేవంత్​రెడ్డి చిత్తశుద్ధి బయటపడింది: ఆలె భాస్కర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీసీల వల్లే కేసీఆర్ ​కుటుంబం బాగుపడిందని, త్యాగాలు బీసీలవైతే భోగాలు మాత్రం కేసీఆర్​వి అంటూ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ బీసీలకు ఏం చేశారని టీఆర్ఎస్ ​మంత్రులు ప్రశ్నిస్తున్నారని, బీసీ కమిషన్ వేసి చట్టబద్ధత కల్పించిన విషయం ఆ మంత్రులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రీయ, నవోదయ విశ్వ విద్యాలయాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది నిజం కాదా అని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి వర్గంలో 47 శాతం బీసీలే ఉన్నారని తెలిపారు. తెలంగాణ సర్కార్ బీసీలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్​చేశారు. బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు చేశారు. ఐదు సంవత్సరాల నుండి బీసీలకు రుణాలు ఇవ్వడం లేదని ఆయన ఫైరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బడుగు బలహీన వర్గాలపై ఉన్న చిత్తశుద్ధి బయటపడిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Next Story