రెడ్​హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఉద్యోగులు

by Disha Web |
రెడ్​హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఉద్యోగులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ అధికారులు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెదక్ జిల్లా శంకరంపేట ఎమ్మార్వో కార్యాలయంలో శ్రీహరి రెవెన్యూ ఇన్స్​పెక్టర్‌గా పని చేస్తున్నాడు. సంగాయపల్లి గ్రామానికి చెందిన పాపన్నపేట శ్రీనివాస్ అనే వ్యక్తి ఊర్లో సర్వే నెంబర్​1313లో తనకు చెందిన 0.22 గుంటల భూమికి సంబంధించిన వివరాలు పట్టాదారు పాస్​బుక్‌లో తప్పుగా రికార్డ్ అయ్యాయని, వాటిని సరి చేయించాలని చందంపేట గ్రామం వీఆర్ఏ గూడూరి తలారి సురేష్​బాబును సంప్రదించాడు.

పనిచేసి పెడతానని చెప్పిన సురేష్​బాబు దానికి రూ. లక్ష ఖర్చు అవుతుందని చెప్పాడు. దాంతో శ్రీనివాస్​ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో వల పన్నిన ఏసీబీ అధికారులు సోమవారం సురేష్​బాబు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో రెవెన్యూ ఇన్స్ పెక్టర్ శ్రీహరి సూచనల మేరకే తాను డబ్బు తీసుకున్నట్టు సురేష్​బాబు వెల్లడించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఇద్దరిని అరెస్ట్​చేసి వారి నుంచి లంచంగా తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
Next Story