సీఎస్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు(వీడియో)

by Disha Web Desk 4 |
సీఎస్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు(వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నియామకం విషయంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం వెల్లడించిన తీర్పును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ నియామకంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. బీహార్ ముఠాకు సోమేశ్ కుమార్ లీడర్ అని అనర్హుడైన ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు సోమేశ్ కుమార్ సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించి, వాటిపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. సోమేశ్‌కుమార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని.. ధరణిలో లోపాల కారణంగా చనిపోయిన రైతుల గోస సోమేశ్‌కు తాకిందని అభిప్రాయపడ్డారు.

సోమేశ్ కుమార్‌కు అర్హత లేకపోయినా కేసీఆర్ నియమించారని ఆరోపించారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన క్యాడర్ ఆఫీసర్. 8 సంవత్సరాల ఉద్యోగానికి రాజీనామా చేసి విదేశాలకు వెళ్లారని.. ఆ ఎనిమిది సంవత్సరాల సర్వీసును తొలిగిస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాకు కూడా సోమేశ్ కుమార్‌కు అర్హత లేదన్నారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర సీఎస్‌గా నియమించి కేసీఆర్ ఆయనకు అనుకూలంగా ఉంచుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంత ఐఏఎస్‌లకు ఎప్పటికైనా ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ సూచించారు. కాగా, సీఎస్ సోమేశ్‌కుమార్కు హైకోర్టు ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఆదేశించింది. రాష్ట్రానికి సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసనం.. సర్టిఫైడ్ కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

Most Viewed