CM హోదాలో తొలిసారి యాదగిరి గుట్టకు రేవంత్ రెడ్డి.. ఘన స్వాగతం పలికిన అధికారులు

by Disha Web Desk 19 |
CM హోదాలో తొలిసారి యాదగిరి గుట్టకు రేవంత్ రెడ్డి.. ఘన స్వాగతం పలికిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో సతీ సమేతంగా రేవంత్ రెడ్డి యాదాద్రికి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఇవాళ్టి నుండి యాదాద్రిలో బ్రహోత్సవాలు ప్రారంభం కాగా.. బ్రహ్మోత్సవాల తొలిరోజున సతీ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి సీఎం రేవంత్‌ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం సీఎం దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు.

అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందచేశారు. యాదాద్రి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌ కుమార్‌, వేముల వీరేశం, మందుల సామేల్, బీఎల్‌ఆర్ తదితర స్థానిక నేతలు ఉన్నారు. యాదాద్రి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భద్రాద్రికి వెళ్లనున్నారు. అక్కడ భద్రాద్రి రాముడిని దర్శించుకున్న అనంతరం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌ను లాంఛ్ చేయనున్నారు.



Next Story