Breaking: ఏబీవీపీ కార్యకర్త అంశం పై స్పందించిన సీపీ.. సంచలన నిర్ణయం..

by Disha Web Desk 3 |
Breaking: ఏబీవీపీ కార్యకర్త అంశం పై స్పందించిన సీపీ.. సంచలన నిర్ణయం..
X

దిశ డైనమిక్ బ్యూరో: తాజాగా రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఘటన పై సపందించిన సీపీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి లాగిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.

హైద్రాబాద్ రాజేంద్రనగర్‌ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల భూములులను హైకోర్టుకు కేటాయించవద్దని.. జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ శాంతియుతంగా విద్యార్థి సంఘాలు నిరసన చేస్తున్న నేపథ్యంలో ఓ విద్యార్దినిని కానిస్టేబుల్ జుట్టుపట్టి లాగి పడేసిన విషయం అందరికి సుపరిచితమే.

కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో చూసిన నెటిజన్స్ కానిస్టేబుల్ తీరు పై మండిపడ్డారు. కానిస్టేబుల్ విచక్షణారహిత వైకిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. అలానే నెటిజెన్స్ కూడా డిమాండ్ చేశారు.ఇక ఈ ఘటనపై స్పందించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ తెలంగాణ సీఎస్ తోపాటు డీజీపీకి కూడా నోటీసులు ఇచ్చిన విషయం అందరికి సుపరిచితమే.

కాగా ప్రజలను రక్షించేందుకే పోలీసులు ఉన్నారు. మరి రక్షకులే భక్షకులుగా మారి.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. ప్రజల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు అని.. తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదు అని తెలిసేలా విద్యార్థినిని జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.


Next Story