కేటీఆర్‌తో భేటి అయిన ‘ఇంక్రెడిబుల్ హస్క్’ ప్రతినిధులు

by Disha Web Desk 12 |
కేటీఆర్‌తో భేటి అయిన ‘ఇంక్రెడిబుల్ హస్క్’ ప్రతినిధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: లండన్‌లో మంత్రి కేటీఆర్‌తో ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ ప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు. పొట్టు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. 25 మిలియన్ యూఎస్డీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. యూనిట్ ఏడాదికి1000 ఎంటీ వరకు బయో ప్యాలెట్‌లను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో పొట్టు ,పునర్వినియోగ ప్లాస్టిక్‌ను సేకరించేందుకు సహకార నమూనా కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వంతో సహకరిస్తామని కంపెనీ ఆసక్తితో ఉందన్నారు.

రాష్ట్రంలో తమ ప్రతిపాదిత వెంచర్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ యూకే సీఈఓ కీత్ రిడ్జ్‌వే , ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇండియా సీఈఓ సీకా చంద్ర షేకర్, ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ముఖ్య సంబంధాల అధికారి అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed