TG పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్.. గెజిట్ విడుదల చేసిన సర్కార్

by Disha Web Desk 2 |
TG పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్.. గెజిట్ విడుదల చేసిన సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ఇక నుంచి TG పేరుతోనే జరుగనున్నాయి. దీనిపై గురువారం రాత్రి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్‌లు కేటాయించింది. హైదరాబాద్‌కు TG-09 నుంచి TG-14 వరకు కోడ్‌లు కేటాయించారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ‘టీజీ’ కోడ్‌ నినాదం ఎక్కువగా ఉండేది. అయితే.. కేసీఆర్‌ సర్కారు మాత్రం టీఎస్‌ వైపే మొగ్గుచూపింది. రాష్ట్రం ఏర్పడ్డాక ‘టీజీ’ అనే అక్షరాలను వినియోగించడంపైనా కూడా కేసీఆర్‌ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘టీజీ’ కాకుండా.. ‘టీఎస్’ను వాడాలని కోరుతూ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలకు సీఎస్‌ ద్వారా లేఖలు పంపింది. అయితే, తాజాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్‌‌ను టీజీగా మార్చుతూ ఇటీవల మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


Next Story