దివంగత జైపాల్ రెడ్డి స్పూర్తితో ముందుకెళ్దాం.. సీతారాం ఏచూరి

by Disha Web Desk 20 |
దివంగత జైపాల్ రెడ్డి స్పూర్తితో ముందుకెళ్దాం.. సీతారాం ఏచూరి
X

దిశ, ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డు గ్రహీత దివంగత జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆవిష్కరించారు. రాజకీయ అజాత శత్రువుగా, అందరివాడిగా కీర్తిప్రతిష్టలు పొందిన దివంగత జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అథితులుగా సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి సుభాష్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, ఎంపీ రాములు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జగన్నాధం, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పాల్గొని, జైపాల్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా దివంగత జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. సమావేశంలో పాల్గొన్న అతిథులు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన మహోన్నత వ్యక్తి జైపాల్ రెడ్డి అని అన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో జైపాల్ రెడ్డి కీలకపాత్ర పోశించారని పేర్కొన్నారు.

రాజకీయ నాయకులు, యువత జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల కష్టాలను గురించి క్యాబినెట్లో పలుమార్లు జైపాల్ రెడ్డి గళం విప్పేవారని, అతను చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెట్రో స్టేషన్ కు జైపాల్ రెడ్డి పేరు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పద్మరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



Next Story