గివేం చీరలు..మాకు నచ్చలేదు..!

by Disha Web Desk 20 |
గివేం చీరలు..మాకు నచ్చలేదు..!
X

దిశ , తాండూరు రూరల్ : తెలంగాణ ప్రభుత్వం 18ఏళ్లు నిండిన మహిళలకు, యువతకులకు బతుకమ్మ పండుగ కానుకగా ఇచ్చే చీరల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తారని రెండు రోజులుగా పనులు మానుకొని వుంటే తీరా నాణ్యత లేనివి పంపిణీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాణ్యమైన చీరల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

దసరా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించే బతుకమ్మ చీరలపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే బతుకమ్మ చీరలను పంట చేలకు రక్షణగా, ఇంటి ప్రహరీగా వాడిన సంఘటనలు బయటకు వచ్చాయి. అయితే గివేం బతుకమ్మ చీరలు.. మాకు నచ్చలేవని నాసిరకంగా ఉన్నాయంటూ ఆగ్రహించి మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలను బొంతలుగా వాడుకోవడానికి తప్ప దేనికి పనికిరావని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి యాలాల్, తాండూరు మండలాల్లో పలు గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. అలాగే శనివారం బషీరాబాద్ మండలంలో కూడా పంపిణీ చేశారు. కొంతమందికి ఈ చీరెలు బతుకమ్మ పండుగకు ఎలా కట్టుకుంటామని మండిపడ్డారు. బతుకమ్మ చీరలు క్వాలిటీ లేవని పలువురు మహిళలు అన్నారు. ఈ చీరల కోసం రెండు రోజులుగా ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. ఒక్క రోజు కూలీకి వెళ్తే ఇటువంటివి మూడు చీరలు కొనుక్కోవచ్చన్నారు. ఇప్పుడిస్తున్న చీరలు ఎక్కువ మంది కట్టుకోవడం లేదన్నారు.

ఊయలలు కట్టుకునేందుకు, ఇతర పనులకు వాడుకోవచ్చన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చీరలకు బదులుగా మహిళల అకౌంట్లలో రూ. 2000 వేయాలని డిమాండ్ చేశారు. పాలకులు కుటుంబంలో ఎవరైనా ఇలాంటి చీరెలు కట్టుకుంటారా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు క్వాలిటీ లేవని పలువురు చీరలను మహిళలు వాపోయారు. బతుకమ్మ చీరల పంపిణీ చేస్తారని రెండు రోజులుగా పనులు మానుకొని ఉంటే తీరా నాణ్యత లేనివి పంపిణీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని చీరెలు ఇచ్చారని బతుకమ్మ చీరెలను పలువురు మహిళలు ఛీ కొట్టారు. ప్రభుత్వం నాణ్యమైన చీరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.


Next Story