అలుగు పై కన్ను.. కన్నెత్తి చూడని ఇరిగేషన్ అధికారులు..

by Disha Web Desk 20 |
అలుగు పై కన్ను.. కన్నెత్తి చూడని ఇరిగేషన్ అధికారులు..
X

దిశ, తాండూరు రూరల్ : ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ వ్యక్తి అక్రమంగా ప్రాజెక్టుకు చెందిన అలుగు భూమిపై కన్నేశారు. తాండూర్ మండలం అల్లాపూర్ గ్రామ శివారులో ఉన్న అల్లాపూర్ ప్రాజెక్టు ఉంది. దీని కింద సుమారు 14 వందల 14 ఎకరాల సాగువిస్తీర్ణం గల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు అలుగుకు లోతట్టు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్ ఆక్రమణకు గురవుతుందని ఆ గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు కింద గల సర్వేనెంబర్ 176/అ లో 4 ఎకరాల 20 గుంటలు భూమి తాండూర్ మండలం ఎల్మకన్న గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తి పేరు పై పట్టా భూమి అని చెపుతున్నారు.

గత 50 ఏళ్లుగా చెరువు నీళ్లు ఈ అలుగు భాగం కిందికి పారుతుంది. 50 ఏండ్ల ఒప్పందాలను కాలరాస్తున్న భూ యజమాని అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూ యజమాని హటాత్తుగా అలుగు భాగంలో తన పట్టా భూమి ఉందంటూ నాపరాతి వ్యర్థాలతో అలుగు ప్రాంతాన్ని పూడ్చి వేస్తున్నాడు. దీంతో వర్షాకాలంలో భారీ వర్షాలకు చెరువు నిండడంతో ఆ అలుగు పూడ్చి వేయడంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి, పంటలు పూర్తిగా నీటిలో నిండుగా మునిగి, నీటి ఉదృతకు పంట పొలాలు కోతకు గురయ్యే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

పట్టించుకోని అధికారులు..!

అధికారుల కళ్లముందే చెరువు భూమి అక్రమార్కుల పాలవుతున్నా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి కాపాడాల్సి ఉన్న అటువైపు దృష్టి పెట్టడం లేదు. దీంతో చెరువు భూమిని అన్యాక్రాంతమవుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే అధికారులు కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అక్రమణదారులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు చెరువు శిఖం భూములను కాపాడాలని మత్స్యకారులు, ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed