తొలిసారిగా తాండూరు అసెంబ్లీ బరిలోకీ దిగనున్న మహిళా అభ్యర్థి..?

by Disha Web Desk 20 |
తొలిసారిగా తాండూరు అసెంబ్లీ బరిలోకీ దిగనున్న మహిళా అభ్యర్థి..?
X

దిశ, తాండూరు రూరల్ : రోజురోజుకి మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. చాలా దేశాల్లో మహిళలు ప్రధానిగా గెలిచి తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాగే.. అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ నుంచి ప్రధాని స్థాయి వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాని.. ఆ ప్రాంతలో 63 ఏళ్లు గడిచినా.. ఒక్క మహిళ కూడా ఇప్పటివరకు అసెంబ్లీ బరిలో నిలవాడపోవడం గమనార్హం. కాని తొలిసారిగా ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన సునీత సంపత్ కుమార్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నీలిసి చరిత్ర సృష్టిచనున్నారు

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం 1962 నుంచి 2018 వరకు అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటికి పురుషులు మాత్రమే పరిమితమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తాండూరు అసెంబ్లీ నుండి ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన సునీత సంపత్ పోటీలో నిలిచేందుకు సై అంటున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మహిళలు ఎవరు అసెంబ్లీ బరిలో నిలువలేదు. తొలిసారిగా ఈమె నిలిచేందుకు సై అంటున్నారు. దీంతో మహిళలతో పాటు విద్యావంతులు, మేధావులు ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి. మొదటినుంచి బీజేపీకి వ్యతిరేకం. బీఆర్ఎస్ ఆ ఇద్దరు నేతల మధ్య టికెట్ పంచాయతీలు. ఆమెకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీపైన మంచి విశ్వాసం. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారా..? లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా..? అన్నది తెలియాలంటే వేచి చూడాలి మరీ.

రాజకీయ అనుభవం..

తాండూరు పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిఠాన్ని తగ్గించుకొని ఊహించిన విజయాన్ని చేజిక్కించుకున్నారు. 2019లో కాంగ్రెస్ తరపున జిల్లా చైర్పర్సన్ అభ్యర్థిగా యాలాల మండలం నుంచి పోటీ దిగారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారని బీఆర్ఎస్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దాంతో పోటికి దూరమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సునీత సంపత్ బరిలో నిలిచేందుకు సన్నహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహిళా ఓట్లే అధికం..

తాండూరు నియోజకవర్గంలో అత్యధికంగా మహిళ ఓటర్లు ఉన్నప్పటికీ ఎవరు కూడా రాజకీయంగా రాణించలేక పోయారనే వాదనలు ఉన్నాయి. ఇప్పటివరకు అనేకమంది రాజకీయ అనుభవం కల్గి ఉన్నప్పటికీ అంతగా ప్రభావం కనిపించలేదని చెప్పాలి. దాంట్లో నియోజకవర్గంలో రెండు లక్షల పైన ఓటర్లు ఉండగా అందులో లక్షా ఎనిమిది వేల నా ఓటర్లు పురుషులు కాదా మహిళల ఓటర్ల సంఖ్య ఒక లక్ష 13వేల పైన ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు మహిళా అభ్యర్థి ప్రస్తావని రాలేదు మహిళ ఓటర్లు అధికంగా ఉండడంతో మహిళ అభ్యర్థిగా బరిలో ఉండెందుకు తాండూర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతా సంపత్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.

నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు అలాగే స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవలు కార్యక్రమాలు ఉండటంతో గ్రామీణ ప్రజలతో మమేకమై ముందుకు నడిచే మనస్తత్వం కలిగిన తాండూర్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీత సంపత్ కు అన్ని అర్హతలు ఉన్నాయంటూ మహిళల నుండి సైతం పూర్తిస్థాయిలో మద్దతు కనిపిస్తోంది. రాజకీయ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహితులు యువకుల ద్వారా సానుకుల పరిస్థితులు కనబడడంతో ప్రజల మధ్య మరింత ఉత్సాహంగా కనిపించేందుకు స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తూ ముందుకు వెళ్ళుతుందనే చెప్పక తప్పదు. దీంతో ప్రజా మద్దతుకు కొదవ లేదని ప్రజల వాదనలు వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed