ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

by Disha Web Desk 11 |
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
X

దిశ, ఆమనగల్లు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందని దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఎమ్మెల్యే జైౌపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ ఆమనగల్, కడ్తాల్ ఉమ్మడి మండలాల పీఏసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జడ్పీటీసీ జర్పుల దశరథ నాయక్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తుందని తెలిపారు.

సీఎం కేసీఆర్ రైతుల శ్రేయస్సు కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఆమనగల్ పట్టణంలో సేవాలాల్ భవన నిర్మాణానికి రెండు కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ దొనాధుల సత్యం, స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపిటిసి సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, లచ్చిరాం నాయక్, బోప్పిడి గోపాల్, మంజుల చంద్రమౌలి, ప్రియా రమేష్, ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ, పిఎసిఎస్ డైరెక్టర్లు చేగురి వెంకటేష్, వెంకటయ్య, దొల్య నాయక్ సేవ్య నాయక్ మార్కెట్ డైరెక్టర్ లు లాయక్ అలీ, నరసింహ, మంగలి పల్లి నర్సింహా, సులోచన, సాయిలు తదితరులు పాల్గొన్నారు.


Next Story