విద్యుత్​చౌర్యం.. అందకారంలో పరిగి...

by Dishanational1 |
విద్యుత్​చౌర్యం.. అందకారంలో పరిగి...
X

దిశ, పరిగి: వీధి లైట్లే కదా ఎవరు పట్టించుకుంటారనుకున్నారేమో.. పాపం నేహనల్​హైవే అథారిటీ వాళ్లు నామ్ కేవాస్తే..ఓ మీటర్​పెట్టి ఓ హైమాస్ట్​లైట్​రీడింగ్​వచ్చేలా ఏర్పాటు చేసి ఏకంగా 19 నెలల నుంచి విద్యుత్​దొంగలిస్తూ పరిగిలో హైవే రోడ్డు వెంబడి వెలుగు చిమ్మిచ్చారు. ఇలా అప్పనంగా విద్యుత్​వాడుకుంటూ బిల్లులు ఎగ్గొడతారా అంటూ డిస్కం ఏఈ చాలాసార్లు ఎస్​ఎస్​ఆర్​రోడ్డు కాంట్రాక్టర్, నేషనల్ హైవే వాళ్లకు చెప్పినా పెడచెవిన పెట్టారు. దీంతో డిస్కం అధికారులు విద్యుత్​సరఫరా నిలిపివేశారు. కేవలం ఒక మీటర్​తీసుకుంటే సరిపోతుందని అప్పట్లో డిస్కం అధికారులు చెప్పి నాడు అదనంగా మళ్లీ మీటర్​ తీసుకోవాలంటూ చెబుతున్నారంటూ రోడ్డు కాంట్రాక్ట్​సూపర్​వైజర్ తెలిపాడు.

102 వీధిలైట్లు...రెండు హైమాస్ట్​లైట్లు

పరిగి మున్సిపల్ పరిధిలో హైవే రోడ్డుపై హైదరాబాద్ వైపు నుంచి వస్తుంటే ఇండెన్ పెట్రోల్​పంపు నుంచి టెలిపోన్ ఎక్చైంజ్, బస్టాండ్, బాహర్​పేట్, కోడంగల్​చౌరస్తా, హెప్ పి పెట్రోల్​బంకు వరకు 102 వీధిలైట్లు, టెలిఫోన్​ఎక్చైంజ్​వద్ద ఒక పెద్ద హైమాస్ట్​లైట్, కోడంగల్​చౌరస్తా వద్ద పెద్ద హైమాస్ట్​లైట్లు మొత్తం 104 స్తంబాలు ఉన్నాయి. వీటికి 204 బల్బులు, రెండు హైమాస్ట్​లైట్లకు కలిపి 16 మొత్తం 220 ఎల్​ఈడీ బల్బులు ఉన్నాయి. వీటిలో కేవలం ఓ హైమాస్ట్​లైట్​స్తంబం, మరో కొన్ని హైపై ఉన్న వీధిలైట్లకు మాత్రమే రీడింగ్​వచ్చేలా రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసి విద్యుత్​సరఫరా చేస్తున్నారు. మిగతా స్తంబాలు, హైమాస్ట్ లైట్ కు సపరేటుగా విద్యుత్​మీటర్లు తీసుకోవాలని డిస్కం అధికారులు హైవే వాళ్లకి చెప్పినా వారు పట్టించులేదు. గతంలో కూడా విద్యుత్ సరఫరా నిలివేస్తే స్థానిక పాలకులు రిక్వెస్ట్​మేరకు త్వరలో వాళ్లతో మాట్లాడి మీటర్లకు దరఖాస్తు చేయిస్తామంటూ చెప్పి తిరిగి సరఫరా ఇప్పించారు. అయినా హైవే వాళ్లు ఎలాంటి దరఖాస్తు చేసుకోకపోవడంతో తిరిగి డిస్కం అధికారులు విద్యుత్​సరఫరా నిలిపివేశారు.

19 నెలలుగా విద్యుత్​చౌర్యం..

హైవే పై ఉన్న విద్యుత్​102 స్తంబాలకు, 2 హైమాస్ట్ స్తంబాలకు మీటర్లు బిగించుకోవాలని చెప్పినా నామ మాత్రంగా ఒక మీటర్ తీసుకుని కేవలం కొన్నింటికి మాత్రమే రీడింగ్ వచ్చేలా తాగాజా ఫిబ్రవరి మాసం ఒక నెలకే 13 వేల రూపాయల బిల్లు వచ్చింది. మిగతా అన్ని వీధిలైట్లు, హైమాస్ట్​ లైట్ల అన్నింటికి రీడింగ్​వచ్చేలా చేస్తూ నెలకి రూ. 60 వేల దాకా బిల్లు వస్తుందని విద్యుత్​అధికారులు అంచనా వేశారు. ఇలా 19 నెలల నుంచి నెలకి రూ. 60 వేల చొప్పున రూ. 11.40 లక్షలు నేషనల్ హైవే కాంట్రాక్టర్​నుంచి డిస్కం శాఖకు నష్టం వాటిల్లింది.

అందకారంలో పరిగి...

పరిగి మున్సిపల్​పరిధిలోని నేషనల్ హైవే రోడ్డు మధ్యలో వీధిలైట్లకు పదిహేను రోజుల క్రితం విద్యుత్​అధికారులు విద్యుత్ సరఫరా(డిస్​కనెక్ట్) నిలిపివేశారు. దీంతో టెలిఫోన్​ఎక్చైంజ్​బాహర్ పేట్, కోడంగ్​చౌరస్తా, హెప్ పి పెట్రోల్​బంక్​వరకు పరిగి పట్టణం హైవే రోడ్డు పొడుగునా అందకారం నెలకొంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేవారు సెల్ ఫోన్​లైట్లు, వాహనాల వెలుతురులో వెళ్తూ ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. మున్సిపల్, స్థానిక పాలకులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు.

చెప్పినా పట్టించులోలేదు.. డిస్ కనెక్ట్​చేశాం : ఖాజా బాబు( డిస్కం ఏఈ– పరిగి )

హైవే మధ్యలో వీదిలైట్లు, హైమాస్ట్​లైట్లకు కలిపి గతంలో ఒక మీటర్​తీసుకుని కేవలం కొన్నింటికి మాత్రమే రీడింగ్​వచ్చేలా కనెక్షన్ తీసుకున్నారు. మిగతావాటికి ఎక్కడ ట్రాన్స్ ఫార్మర్ దగ్గరగా ఉంటే అక్కడి నుంచి విద్యుత్​సరఫారా అయ్యేలా కనెక్షన్​తీసుకున్నారు. ఇలా ఏడాదికిపైగా కేవలం నామమాత్రంగా బిల్లు కడుతూ మిగతా వాటికి ఎలాంటి బిల్లు లేకుండా విద్యుత్ వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న మీటర్ నుంచే ఒకే వైరుతో అన్ని స్తంబాలకు కనెక్షన్ అయినా తీసుకోండని, లేదా అదనంగా మీటర్లు కావాలంటూ ధరఖాస్తు చేసుకోండని చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదు. అందుకే పదిహేను రోజుల క్రితం విద్యుత్​కనెక్షన్​ తొలగించాం. ఈ విషయమై మున్సిపల్​శాఖ అధికారులకు ప్రశ్నిస్తే తమకు ఇంకా హైవే వాళ్లు అప్పగించలేదని చెప్పారు.



Next Story

Most Viewed