బెల్ట్ షాపుల పై మీర్ పేట్ పోలీసుల వరుస దాడులు

by Disha Web Desk 11 |
బెల్ట్ షాపుల పై మీర్ పేట్ పోలీసుల వరుస దాడులు
X

దిశ, మీర్ పేట్: కిరాణా దుకాణం లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి నీ మీర్ పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్, నందనవనం కు చెందిన భారతి ప్రీత్ చంద్ రావు 21 అనే వ్యక్తి తన కిరాణా దుకాణం లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మీర్ పేట్ పోలీసులు దాడి చేసి చేసి కిరాణా దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. 513 మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి. వాటి విలువ రూ .91 వేల వరకు ఉంటుంది. మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని ఈ కేసును మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story