చెరువులను మింగేస్తున్న రియల్టర్లు

by Disha Web Desk 20 |
చెరువులను మింగేస్తున్న రియల్టర్లు
X

దిశ, మహేశ్వరం : మహేశ్వరం మండలం హైదారాబాద్ నగరానికి కూతవేట దూరంలో ఉండటంతో మండలంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అక్రమార్కులు సహజ సిద్దంగా ఉన్న చెరువులను, వాగులను కబ్జాలు చేస్తూ వెంచర్లు నిర్మాణం చేస్తున్నారు. వెంచర్ నిర్మాణం చేసేటప్పుడు వెంచర్ పక్కనే చెరువు ఉంటే చెరువు శిఖం భూమిని వెంచర్ లో కలుపుకొని చెరువు శిఖం భూమిలో ప్రహరీ గోడను నిర్మించారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 144 లో తిమ్మాయి చెరువు (తిమయ్య చెరువు)రెవెన్యూ రికార్డుల ప్రకారం 34.05 ఎకరాలు తిమ్మాయి చెరువు ఉంది. చెరువు పక్కనే 145, 146, 147, 148, 149 సర్వే నంబర్ లల్లో సాయిప్రియా వెంచర్ ఉంది. వెంచర్ నిర్వాహకులు వెంచర్ నిర్మాణం చేసే క్రమంలో చెరువులోకి వచ్చే వాగులను మట్టితో పూడ్చి వేశారని, చెరువు శిఖం భూమిలో సాయిప్రియ వెంచర్ నిర్వాహకులు ప్రహరీ గోడ నిర్మించారని తుమ్మలూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

హెచ్ఎమ్ డీఏ, డీటీసీపీ నిబంధనలు తూచ్...?

హెచ్ఎమ్ డీఏ, డీటీసీపీ వెంచర్ నిర్మాణం చేపట్టలాంటే ఇంటర్నల్ రోడ్డు 33 ఫీట్లు, అప్రోచ్చు రోడ్డు 45 రోడ్లు నిర్మాణంతో పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, వాటర్ సౌకర్యం లాంటి వసతులు కల్పించాలి. హెచ్ఎమ్ డీఏ, డీటీసీపీ నిబంధనలు ఏమి పాటించకుండా ప్లాట్లను అమ్ముతున్నారు.

మరో ప్రక్క సాయిప్రియ వెంచర్ లో హెచ్ఎమ్ డీఏ ఒక బ్లాక్, డీటీసీపీ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. వినియోగదారులకు హెచ్ఎమ్ డీఏ ప్లాట్లు కలవు అని సినిమా హీరోలతో బ్రోచర్లు తయారు చేసి ప్లాట్లు అమ్మకాలు జరుపుతున్నారు. వినియోగదారులు వెంచర్ వద్దకు వచ్చి చూస్తే హెచ్ఎమ్ డీఏ ఒక బ్లాక్, డీటీసీపీ ఒక బ్లాక్ అని వినియోగదారులకు చెప్పి ప్లాట్లు అమ్ముతున్నారు.

రైతులు వెళ్ళే దారి మూసివేత ?

సాయిప్రియా వెంచర్ నిర్వాహకులు వెంచర్ చూట్టు ప్రహరీ గోడ, కంచె వేయడంతో వెంచర్ వెనకాల భూములు ఉన్న రైతులు తమ పొలాలకు వెళ్ళే దారి, చెరువు వద్దకు వెళ్ళే దారి లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. తాము పొలాల్లోకి వెళ్లాలంటే వెంచర్ వారి మేయిన్ గేట్ వద్ద వారి అనుమతి తీసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటున్నారు.

తహశీల్దార్ ఎండీ మహమూద్ ఆలీ ఈ విషయం పై స్పందించి రెవెన్యూ రికార్డుల ప్రకారం తిమ్మాయి చెరువు 34.05 ఎకరాలు ఉందన్నారు. చెరువు ఆక్రమణకు గురైతే సర్వే చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేద అని అంటున్నారు.



Next Story

Most Viewed