అక్రమార్కులపై చర్యలేవి ?

by Disha Web Desk 12 |
అక్రమార్కులపై చర్యలేవి ?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: సాగుకు జీవనాధారమైన చెరువులు అంతరించిపోతున్నాయి. జిల్లాలో ఉన్న చెరువులను కాపాడడంలో ఇరిగేషన్​ అధికారులు విఫమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు చెరువుల్లో ఉండే బంకమట్టిని లక్షల రూపాయాలకు అమ్ముకుంటున్నారు. కేవ లం గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతి తీసుకొని మట్టి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చెరువులకు స్థానిక కార్యదర్శులకు ఎలాంటి సంబంధం ఉంటుంది. ఒక వేళ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్​లకు ఈ విషయం తెలిస్తే రెవెన్యూ, ఇరిగేషన్​, మైనింగ్​ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఇరిగేషన్​ అధికారులు పూడికతీతలో భాగంగా చెరువుకు టెండర్​ వేసి మట్టి తరలింపునకు అనుమతిస్తుంది. ఆ తర్వాత ఇరిగేషన్​ అధికారులు చెరువు పరిధి, విస్తీర్ణం పరిశీలించి ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటుంది.

మైనింగ్​ ఎంత లోతు, వెడల్పులో మట్టి తీస్తున్నారో పరిశీలించి వేబిల్లులు, ట్రాన్స్​ పోర్ట్‌కు అనుమతు లు ఇస్తారు. కానీ ఇవేమీ లేకుండా ఇటుక బట్టీ వ్యాపారులకు లక్షల విలువైన బంకమట్టిని నామమాత్రపు ఫీజుతో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్​కలిసి బిల్లులు సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరిగేషన్​, రెవెన్యూ, మైనింగ్​ అధికారులు మౌనంగా ఉంటున్నారు. ఈ బంకమట్టి వ్యవహారంలో ముడుపులు ముట్టాయా.. అధికారులకు ఈ విషయం తెలిసినా చెరువులను పరిశీలించి చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఈ మట్టి తరలింపు రాత్రి సమయాల్లోనే కొనసాగుతుంది. మాడ్గుల మండలం ఇర్విన్​ గ్రామ రెవెన్యూ పరిధిలోని దిల్​వార్​ఖాన్​‌పల్లి చెరువుల్లోని బంకమట్టిని నిబంధనలకు విరుద్దంగా తరలించారు.

ఇప్పుడు చెరువులో ని బంకమట్టిని పూర్తిగా ఇటుక బట్టీ వ్యాపారులకు సర్పంచ్​ అమ్ముకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మట్టిని ఏయే గ్రామాల గుండా టిప్పర్లు ద్వారా తరలించారో ఆ ప్రజలు కూడా ధర్నాలు చేశారు. టిప్పర్ల రాకపోకలతో రోడ్లు, ఇండ్లలోకి దుమ్ము, ధూళీ వస్తుందని నిలదీయడంతో ఆ గ్రామాల సర్పంచ్​లతో మాట్లాడి నగదు ఇస్తామని ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు అనుగుణంగా మట్టి తరలిస్తే నగదు ఒప్పందాలు ఎందుకు జరుగుతాయనే చర్చ ఉంది. ఆదిబట్లలో తయారు చేసే ఇటుక బట్టీల వ్యాపారికి బంకమట్టిని అమ్ముకున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఆర్కపల్లి శివారుల్లోని బాపనికుంటలోని బంకమట్టిని రాత్రి సమయాల్లో ఇటుకు ల తయారీ కోసం తీసుకెళ్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి బంధువు కావడంతో అధికారులు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. మాజీ జడ్పీటీసీకి చెందిన బం ధువైతే నిబంధనలను తుంగలోకి తొక్కేయోచ్చని అధికారులే మద్దతు పలుకుతున్నారని ప్రచారం సాగుతుంది. తలకొండపల్లి మండలంలోని కోరింత కుంట తండా సమీపంలో సర్వేనెంబర్ 257 లోని 7.02 గుంటల ప్రభుత్వ భూమి లో పోతురాజు చెరువు ఉంది.

మూడేళ్లుగా వేసవిలో ఆ చెరువులో ఉపాధి కూలీలతో లేబర్ పనులు కొనసాగిస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా అదే చెరువులో నెల రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. ఆ చెరువులోని మట్టిని తరలించి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కుల కన్ను పడింది. 3 రోజులుగా అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దళారి వ్యాపారులు పెద్ద పెద్ద టిప్పర్లు, ఎక్స్ వేర్లతో రాత్రికి రాత్రే మట్టిని నింపి ఇటుక బట్టీలకు, ఇసుక ఫిల్టర్స్ వద్దకు తరలిస్తున్నట్లు గిరిజనులు పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed