'నా కోరిక ఇప్పుడు నెరవేరింది'.. ప్రారంభోత్వంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Dishafeatures2 |
నా కోరిక ఇప్పుడు నెరవేరింది.. ప్రారంభోత్వంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మీర్ పేట: రంగారెడ్డి జిల్లాకు రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీని, మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూర్‌లో నిర్మించాలని నిర్ణయించినట్లు స్థానిక ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడం పట్ల ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో లైన్స్ క్లబ్ సంస్థ నూతనంగా ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉండాలని ఎప్పుడూ ఒక కోరిక ఉండేదని, ఆ కోరిక ఈరోజు నెరవేరిందని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో

మెడికల్ కాలేజీతో పాటు వంద పడకల ఆసుపత్రి కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. పేద ప్రజలకు సేవ చేయడంలో లైన్స్ క్లబ్ సంస్థ కృషి అభినందనీయమని సబితా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ రఘు, సెకండ్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరి నారాయణ, అడ్వైజర్ చెన్నకిషన్ రెడ్డి , మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ నాగేశ్వర్,మేయర్ దుర్గా దీపు లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, సిద్దాల లావణ్య, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అనిల్ యాదవ్, లైన్స్ క్లబ్ సభ్యులు సిద్ధల బీరప్ప, రాజేందర్ రెడ్డి, లంకాల కిషోర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.




Next Story

Most Viewed