కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో రగడ (వీడియో)

by Disha Web Desk 12 |
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో రగడ (వీడియో)
X

దిశ, గండిపేట్: సోమవారం గండిపేట మండల రెవెన్యూ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో భాగంగా వట్టినాగులపల్లికి చెందిన ధర్మపురి వనజకు కళ్యాణ లక్ష్మి చెక్కు మంజూరు అయ్యింది. కాగా ఆ చెక్కును కుటుంబ సభ్యులైన సాయిరాంకు ఇవ్వాలని కోరారు. కానీ చెక్కును ఇవ్వడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీటీసీ దారా వెంకటేష్, యువజన నాయకుడు గణేష్ సింగ్ అధికారులను అడిగారు.

దీంతో లబ్ధిదారులు లేకుండా వేరే మరొకరికి ఎలా ఇస్తామని అనడంతో వాగ్వాదానికి దారితీసింది. ఎమ్మార్వో లబ్ధిదారుడు వస్తేనే చెక్కిస్తానని చెక్కును తీసుకున్నారు. దీంతో అధికార పార్టీ నాయకులకు కూడా సరే అలా అయినప్పుడు మరి కొంతమంది ప్రజాప్రతినిధులకు లబ్ధిదారు లేకపోయినా వారికి చెక్కులు ఎలా అందజేశారని ఆయన ప్రశ్నించారు. చెక్కులు పంపిణీ కార్యక్రమంలో సగానికి పైగా లబ్ధిదారులు రాలేదని తెలిపారు. ఈ క్రమంలో అధికారులకు టిఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీని అవమానించారని రెవెన్యూ తహశీల్దార్ రాజాశేఖర్ పై మాజీ ఎంపీటీసీ దారా వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వట్టినాగులపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు చేస్తున్న అక్రమాలపై కళ్యాణ లక్ష్మి సభలోనే ఆరోపించారు. లక్షల రూపాయలు తీసుకుని ప్రభుత్వ స్థలాలను చెరువులు కుంటలను ప్రైవేటు వ్యక్తులకు దారపోస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తున్నారని మాజీ ఎంపీటీసీ అన్నారు.



Next Story

Most Viewed