బీజేఎంసీ ప‌ద్మ‌శ్రీ‌హిల్స్ కాల‌నీలో ప్ర‌జ‌ల వినూత్న‌ నిరసన...

by Disha Web Desk 11 |
బీజేఎంసీ ప‌ద్మ‌శ్రీ‌హిల్స్ కాల‌నీలో ప్ర‌జ‌ల వినూత్న‌ నిరసన...
X

దిశ‌, గండిపేట్ : బండ్ల‌గూడ జాగీర్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్ర‌జా ప్ర‌తినిధుల నిర్ల‌క్ష్యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. పట్టించుకోకుండా కేవ‌లం త‌మ ప‌బ్బం గ‌డుపుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల వేళ‌ల ఇళ్ల ముందు క్యూ క‌ట్టే నాయ‌కులు ముందుగా వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలనే కండీష‌న్లు పెడుతున్నారు.

ప్ర‌ధానంగా కార్పోరేష‌న్ ప‌రిధిలోని ప‌ద్మ‌శ్రీ హిల్స్ కాల‌నీలో నీటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతుండ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో త‌మ‌ను ఓటు అడ‌గాలంటే ముందు నీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి.. త‌ర్వాతే ఓట్లు అడ‌గండి అంటూ ఇళ్ల ముందు బోర్డులు ఏర్పాటు చేసుకొని త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. నగర శివార్లలోని పలు కాల

నీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. పన్నులు చెల్లిస్తున్నా తమ సమస్యల ను ప‌రిష్క‌రించ‌డంలో మాత్రం ప్ర‌జా ప్ర‌తినిధులు నిర్ల‌క్ష్యం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల ముందు ఫ్లెక్సీల ఏర్పాటుతో ప్ర‌జా ప్ర‌తినిధులు ఓట్లు అడిగేందుకు ఆలోచించాల్సి వ‌స్తుంది. తాగునీటి కష్టాలు తీర్చిన తర్వాతే ఓట్లు అడగాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పద్మశ్రీహిల్స్ కాలనీ వాసులు స్పష్టం చేస్తున్నారు.

వినూత్నంగా…

పద్మశ్రీహిల్స్ కాలనీలో నెలకొన్న నీటి ఎద్దడితో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుండ‌టంతో ఓట్ల స‌మ‌యంలోనే నాయ‌కులను అడ‌గ‌డానికి మంచి అవ‌కాశ‌మ‌ని భావించారు. అందుకే త‌మ ఇళ్ల ముందు వినూత్నంగా బోర్డులు త‌ల‌గించి నాయ‌కులు ఎవ‌రూ ఓట్లు అడ‌గ‌వ‌ద్ద‌నేలా పెట్టారు. ప‌న్నులు క‌ట్టించుకునేందుకు ఆస‌క్తి చూపుతారు కానీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో మాత్రం ఎందుకు చొర‌వ చూపడం లేదంటూ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. తాము నీరు లేక నిత్యం అవ‌స్థ‌లు ప‌డుతున్నా అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు మాత్రం ప‌ట్ట‌డం లేద‌ని ఆవేదన చెందుతున్నారు.

స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాలి...

గ‌తంలోనే నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరినా నేటికీ అధికారుల నుంచి స్పంద‌న రావ‌డం లేద‌ని స్థానికులు అంటున్నారు. కాల‌నీలో నెల‌కొన్న నీటి స‌మ‌స్య‌పై గ‌త నెల‌లో మ‌హిళ‌లంద‌రూ రోడ్డెక్కి ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న తెలిపారు. నాడు అధికారులు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామంటూ చెప్పి హామీ ఇచ్చార‌న్నారు. అయినా నేటికీ స‌మ‌స్య మాత్రం ప‌రిష్కారం కాలేద‌ని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.



Next Story

Most Viewed