అనుమతులు రాకముందే నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు..

by Disha Web Desk 6 |
అనుమతులు రాకముందే నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు..
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్: పదుల సంఖ్య ఎకరాల భూముల్లో వెంచర్లు వేయడం.. సుందరవనంగా బ్రోచర్ డిజైన్ చేయడం అనంతరం వెంచర్ని పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా చేయడం ఇళ్లు, ప్లాట్లు అమ్మేయడం ఒక కళ. ఈ కళ కళ్లకు కట్టినట్లుగా అబ్ధుల్లాపూర్మెట్ మండలం పెద్దబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెండవ వార్డులో ఓ వెంచర్ నిర్వాహకులు చేసి చూపించడం మరో కళ. వెంచర్ కు దారి సరిగ్గా లేకుంటే కనీసం స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండానే దాదాపు కిలో మీటర్ దూరం సీసీ రోడ్లు వేయడం, అనుమతులకు ధరఖాస్తులు చేసుకుంటే చాలు.. అనుమతులు రాకున్నా విల్లాస్, ప్లాట్లను విక్రయించి అమాయకులను బురిడి కొట్టిస్తున్న ఓ వెంచర్ నిర్వాహకులపై స్థానికులు, గ్రామస్తులు, అధికారులు ఇచ్చిన కధనం ప్రకారం దిశ ప్రత్యేక కధనం. పసుమాములలోని సర్వే నెంబర్ 97, 98, 107లలో సుమారు పదెకరాల విస్తీర్ణంలో నిర్మల ట్రాన్క్విల్ విల్లాస్ యాజమాన్యం గత యేడాది విల్లాస్ కట్టి విక్రయాలు చేపట్టేందుకు హెచ్ఎండిఎలో ధరఖాస్తులు చేసుకుంది. అక్కడి నుంచి అనుమతులు రాకముందే వెంచర్‌లో దాదాపు పూర్తి స్థాయిలో తమతమ పనులు చక్కబెట్టుకుంది.

అనుమతులు వస్తాయా రావా అని చూడకుండా పూర్తి స్థాయి లో పనులు మొదలెట్టింది. ఈ వెంచర్‌కు వెళ్లాలంటే నాగౌల్ తారామతిపేట రేడియల్ రోడ్డు నుంచి కనీసం కిలో మీటర్ లోపలికి ఉండడంతో సంబంధిత అధికారుల అనుమతులు లేకుండానే కస్టమర్లను ఆకర్శించేందుకు సీసీ రోడ్డును వేశారు. అదే విధంగా రోడ్డు మొదట, వెంచర్ ప్రారంభంలో ఆర్చి నిర్మాణం పూర్తి చేశారు. వెంచర్‌లోకి వెళ్లాక చుట్టు పచ్చని మొక్కలు, రోడ్లు, ఇతరాత్ర పనులు పూర్తి కానిచ్చారు. హెచ్ఎండిఎ అనుమతులు వచ్చిన అనంతరం అయినా కూడా స్థానిక మున్సిపల్ అధికారుల అనుమతులు ఇంటి నిర్మాణానికి తప్పని సరి అయినా ఇటువంటి నిబంధనలను తుంగలో తొక్కి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. మోడల్ హౌస్ పేరిట ఓ ఇంటిని పూర్తిగా అనుమతులు లేకుండా నిర్మించేశారు. మున్సిపల్ కు కేటాయించాల్సిన స్థలాన్నీ ఇంకా పక్కా చేయలేదు. కానీ అన్ని రకాలుగా అనుమతులు వచ్చాయంటూ అమాయకపు ప్రజల వద్ద కోట్ల రూపాయలకు విల్లా చొప్పున విక్రయాలు జరిపించేస్తున్నారు. ఎవరైనా కస్టమర్లు దీనికి అన్ని అనుమతులు ఉన్నాయా అని ప్రస్నిస్తే అనుమతులు లేకుంటే ఇంత అభివృద్ధి చేయనిస్తారా మేడం, సార్ అంటూ గొప్పగా చెప్తూ తమ తప్పులు బయటకు రాకుండా పని కానిచేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి కొనుగోళ్లు చేపట్టి ఆర్థికంగా నష్టపొకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉంటే ఈ భుముల పక్కన కొంత ప్రబుత్వ భూమి, ఎఫ్ఎల్ ఉన్నట్లు, దానిని పార్కు కింద ప్రభుత్వానికి కేటాయించే స్థలాల కింద చూపిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పెద్దఅంబర్‌పేట్‌లో లక్షల్లో పంచుకున్న కొంత మంది ప్రజాప్రతినిధులు

అనుమతులు రాకముందే తాము పనులు అన్ని చేసుకుంటామని, మున్సిపాలిటీ నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో మాట్లాడి సహకరించేందుకు గాను పెద్దఅంబర్‌పేట్‌లో ఓ ప్రజాప్రతినిధి ఇళ్లు ఢీల్కు అడ్డాగా చేశారు. పసుమాములకు చెందిన ఓ నాయకుడు, పెద్దఅంబర్‌పేట్ ప్రజాప్రతినిధితో కలిసి మరికొంత మంది ప్రజాప్రతినిధులకు చర్చలు జరిపి దాదాపు ముప్పై లక్షలు చేతులు మారినట్లు సమాచారం. ఈ డీల్లో పాల్గొన్న వాళ్ళు అధికారులకు కూడా పాత్ర ఉంటుందని సదరు యాజమాన్యం వద్ద డబ్బులు తీసుకుని అధికారులను పక్కదోవ పట్టించడంతో వ్యవహారం బయటికి వచ్చింది.

వెంచర్ పై చర్యలు తీసుకుంటాం : రామాంజుల రెడ్డి, మున్సిపల్ కమీషనర్

సదరు నిర్మలా విల్లాస్ నిర్వాహకులు నిభంధనలకు విరుద్దంగా వెంచర్ ను అభివృద్ధి చేస్తున్నారు. అనుమతులు అన్ని రాకముందే రోడ్లు వేయడం, ఇళ్ల నిర్మానాలు చేయడం వంటి పనులు పూర్తి కానిస్తున్నారు. విషయం తెలుయడంతో గత ఇరవై రోడుల కిందటనే సంబంధిత అధికారులతో నోటీసులు పంపించాం. తొందరలో ఉన్నతాధికారులకు నివేదిక అందించి చర్యలు చేపడుతాం. అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలపైన చర్యలు తీసుకుంటాం.


Next Story

Most Viewed