ఎంపీగా గెలిపిస్తే ప్రజల సమస్యలపై పోరాడతా : మన్నె శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 11 |
ఎంపీగా గెలిపిస్తే ప్రజల  సమస్యలపై పోరాడతా : మన్నె శ్రీనివాస్ రెడ్డి
X

దిశ,కొందుర్గు: మహబూబ్ నగర్ ఎంపీగా తనను మరోసారి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తానని మహబూబ్ నగర్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కొందుర్గు మండలకేంద్రంలోని జిఎం పటేల్ గార్డెన్ లో కొందుర్గు మండలం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, చౌదరి గూడెం మండలం అధ్యక్షుడు హఫీజ్, వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ఆధ్వర్యంలో ఉమ్మడి మండలాల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్ర పాలకుల చేతిలో వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటాలతోనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు. పదేళ్ల కాలంలో ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ దశలవారీగా అభివృద్ధి చేశాడన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఆచరణకాని హామీలను ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ పార్టీ నాయకుల కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు.

తెలంగాణ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన బిజెపికి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ ఏదో ప్రజలు గుర్తించి ఓటు వేయాలని కోరారు. స్థానికుడిని అయిన తననే ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, రామకృష్ణ రెడ్డి, వజ్రం కొండి యాదయ్య, రామకృష్ణ, సుంద,ర్ నర్సింలు, రాంచంద్రయ్య బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed