బైకులతో యువకుల భయంకరమైన స్టంట్‌లు

by Disha Web Desk 23 |
బైకులతో యువకుల భయంకరమైన స్టంట్‌లు
X

దిశ,రాజేంద్రనగర్: అర్ధరాత్రి కొందరు యువకులు రహదారులపై భయాందోళనకు గురి చేసే స్టంట్ లు చేస్తున్నారు. తోటి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యువకుల విన్యాసాలకు తీవ్ర భయాందోళనకు గురైన వాహనదారులు ట్విట్టర్లో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు. . గురువారం అర్ధరాత్రి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 140 నుంచి 170 వరకు కొందరు యువకులు బైకులతో రోడ్లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. ప్రమాదకరమైన స్టంట్లు చేశారు యువకుల విన్యాసాలతో భయాందోళనకు గురైన వాహనదారులు వీడియోలు తీసి ట్విట్టర్లో సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ట్యాగ్ చేశారు. తోటి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న యువకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed