YONO ఎస్బిఐ గెట్ ఆఫర్ రివార్డ్ అనే యాప్ క్లిక్ చేశారో గోవిందా

by Disha Web Desk 11 |
YONO ఎస్బిఐ గెట్ ఆఫర్ రివార్డ్ అనే యాప్ క్లిక్ చేశారో గోవిందా
X

దిశ, తలకొండపల్లి/ ఆమనగల్ : తలకొండపల్లి , మాడుగుల మండలంలోని గురువారం వాట్సప్ గ్రూపులో ఎస్బిఐ యోనో ఆఫర్ గెట్ రివార్డ్ నౌ, స్టేట్ బ్యాంక్ రివార్డ్ అనే యాప్ పేరుతో మొబైల్ ఫోన్ లలో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ కేటుగాళ్లు డబ్బులను కాజేస్తున్నారు. సైబర్ నేరగాల బారి నుండి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన కొంతమంది మొబైల్ నెంబర్లను హ్యాక్​ చేసి ఈజీగా డబ్బులు సంపాదింస్తున్నారు.

తలకొండపల్లి మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మీసాల ఈశ్వరనే యువకునికి చెందిన బ్యాంకు అకౌంట్ నుండి 11000 వేల రూపాయలు నగదు మాయమైనట్లు తెలిపారు. అదేవిధంగా మాడుగుల మండలంలోని అందుగుల సర్పంచ్ జయలక్ష్మి భర్త రాజు బ్యాంక్ అకౌంట్ లో కూడా 3620 నగదు లింకు ఓపెన్ చేసిన తర్వాత అర్థ గంటకు వాట్సప్ గ్రూప్ మొత్తం హ్యాక్​ అయి డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ రావడం తో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈశ్వర్ అనే బాధితుడు వెంటనే అప్రమత్తమై తలకొండపల్లి పోలీస్ స్టేషన్ను సంప్రదించగా ఆన్లైన్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో వెంటనే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆమనగల్ పట్టణంలోని ఎస్బిఐ బ్యాంకులో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి బ్యాంక్ అకౌంటును ఓల్డ్ లో పెట్టించారు. సర్పంచ్ భర్త రాజు చింతపల్లి మండలంలోని ఎస్బిఐ బ్యాంక్ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వాట్సప్ గ్రూపులోని అనవసరమైన లింకులను ఓపెన్ చేసి డబ్బులను పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పోలీసులు, బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు.


Next Story