వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ : ఎమ్మెల్యే రాజాసింగ్

by Disha Web Desk 11 |
వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ :  ఎమ్మెల్యే రాజాసింగ్
X

దిశ, దోమ: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజా సంక్షేమం కోసం తన పరిపాలనలో అనుసరించిన విధానాలు నేటి తరానికి అనుసరణీయమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద, పండుగల సాయన్న విగ్రహావిష్కరణలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,రాజాసింగ్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాటయోధుడు కాకుండా తన వీరత్వం తో యువతరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి, రాజేశ్వరమ్మ, బీఆర్ఎస్ నాయకులు కాసాని వీరేష్, బీజేపీ నాయకులు ప్రహ్లాద రావు, భూనేటి కిరణ్, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, కేశవులు, శేరి రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు హనుమంతు ముదిరాజ్, విజయ్ కుమార్ రెడ్డి, జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed