కేసీఆర్​దృష్టిలో మహిళ అంటే కవిత ఒక్కరే.. రాజస్థాన్​కాంగ్రెస్​ఎమ్మెల్యే కృష్ణ పూనియ

by Dishafeatures2 |
కేసీఆర్​దృష్టిలో మహిళ అంటే కవిత ఒక్కరే.. రాజస్థాన్​కాంగ్రెస్​ఎమ్మెల్యే కృష్ణ పూనియ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళ అంటే కవిత ఒక్కరే అనేలా సీఎం కేసీఆర్​వ్యవహరిస్తున్నాడని రాజస్థాన్​కాంగ్రెస్​ఎమ్మెల్యే కృష్ణ పూనియ పేర్కొన్నారు. హైదరాబాద్ కు వచ్చిన ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్​ఎస్​పాలనలో దాడులు పెరిగాయన్నారు.2014 నుండి ఇప్పటి వరకు మహిళలకు అవమానం జరుగుతుందన్నారు.బీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణమన్నారు.తెలంగాణ లో చైన్ స్నాచింగ్,సైబర్ దాడులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో మద్యం నియంత్రణ లో కేసీఆర్ సర్కార్ విఫలం అయిందన్నారు.రాష్ట్రంలో బీఆర్​ఎస్​, బీజేపీలు ఒకటేనని చెప్పారు.

లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.ఢిల్లీలో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ.. బీఆర్ఎస్ విషయంలో మౌనంగా ఉన్నదని విమర్శించారు. ఇక ఇప్పటి వరకు మహిళలకు కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. కల్యాణ లక్ష్మీ పథకంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల వేధింపులు భరించలేక ఢిల్లీలో యువతి ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్నారు. మెడికల్ కాలేజీలో వేధింపులు తట్టుకోలేక మెడికో ఆత్మహత్య చేసుకున్నదన్నారు. కాంగ్రెస్​ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తుందన్నారు. బీఆర్ఎస్,బీజేపీ లు ఒకటై,,కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.



Next Story

Most Viewed